amazon gif sale offers big deals on Samsung 55 inch Mini LED smart tv
అమెజాన్ GIF Sale నుంచి Samsung 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో అందుకోండి. ఈ ఆఫర్ మీకు లేటెస్ట్ గా ప్రకటించిన దీవాళీ ఎడిషన్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లో విడుదలైన లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ ముగిసే కంటే ముందే ఈ సేల్ బిగ్ డీల్స్ తో బెస్ట్ ధరలో ఈ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు అమెజాన్ GIF Sale నుంచి 21% డిస్కౌంట్ తో రూ. 47,490 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 3,750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 41,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది .. ఎక్కడంటే.!
ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ బిగ్ సైజులో ఉండే మినీ ఎల్ఈడి HDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అంతేకాదు, K అప్ స్కేలింగ్ కలర్ బూస్టర్ మరియు HDR 10+, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, సుప్రీం మినీ ఎల్ఈడి డిమ్మింగ్ మరియు కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ లేటెస్ట్ 4K ప్రాసెసర్ తో నడుస్తుంది.
ఈ టీవిలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఇది టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అదనంగా, ఈ టీవీ కలిగిన అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ ఫీచర్స్ వలన మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 3 HDMI, 1 USB-A, ఆప్టికల్ అవుట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, LAN మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.