Infinix GT 50 Pro now available with big launch deals
Infinix GT 50 Pro: ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ లాంచ్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ విడుదల చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా అందించిన లాంచ్ ఆఫర్స్ తో రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ ని కేవలం 12 జీబీ అండ్ 256 జీబీ సింగల్ వేరియంట్ తో మాత్రమే విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది.
ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ పైన రూ. 5,000 రూపాయల భారీ HDFC బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను యూజర్లు రూ. 64,999 ధరలో అందుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ అందించిన పండుగ సేల్ నుంచి మరో రెండు బిగ్ డీల్ కూడా అందించింది.
అవేమిటంటే, ఈ ఫోన్ పైన రూ. 6,750 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis అండ్ ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 63,249 ధరలో లభిస్తుంది.
Also Read: లేటెస్ట్ 55 ఇంచ్ Mini LED Smart Tv ని కేవలం సాధారణ టీవీ ధరకే అందుకోండి.!
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. మీడియాటెక్ Dimensity 8400 Ultimate ప్రాసెసర్ తో ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ చేసింది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 2.2 మిలియన్ AnTuTu స్కోర్ అందిస్తుంది.
అలాగే, ఈ ఫోన్ LPDDR5X 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇది గేమింగ్ ప్రత్యేకమైన ఫోన్ మరియు గేమింగ్ కోసం ఈ ఫోన్ లో ప్రత్యేకమైన GT ట్రిగ్గర్స్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ తో అటాచ్ చేసే ప్రత్యేకమైన GT కంట్రోలర్ మరియు GT మెగా చార్జర్ కూలర్ ని ఇన్ఫినిక్స్ అందించింది.
ఈ ఫోన్ 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో పాటు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 60FPS 4K వీడియో సపోర్ట్ మరియు సెల్ఫీ కెమెరా కూడా 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది.