OPPO Enco X4 now available with big deals
OPPO Enco X4 ఇయర్ బడ్స్ ని ఒప్పో లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఇప్పుడు భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. LHDC లాస్ లెస్ వంటి ప్రీమియం అండ్ గొప్ప డిజైన్ తో లాంచ్ అయిన ఈ ఇయర్ బడ్స్ మీకు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ తో పాటు ఈ ఎన్కో x4 ఇయర్ బడ్స్ ని కూడా లాంచ్ చేసింది.
ఒప్పో ఈ లేటెస్ట్ ఎన్కో ఎక్స్ 4 ఇయర్ బడ్స్ ని రూ. 19,999 ధరతో మార్కెట్ లో లాంచ్ చేసింది. లాంచ్ లో భాగంగా ఈ బడ్స్ పైన రూ. 1,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందించింది. ఇది కాకుండా అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఇయర్ బడ్స్ పైన రూ. 1,750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ ఒప్పో ఇయర్ బడ్స్ ని బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఈ బడ్స్ అరోరా వయొలెట్ మరియు గ్లేసియర్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో ఈ బడ్స్ ని చాలా ప్రీమియం ఫీచర్స్ అండ్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఇందులో డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇందులో 11mm ఉఫర్ జతగా 6mm ట్వీటర్ ఉంటుంది. సెటప్ తో మంచి రాకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ క్రాస్ ఎకో సిస్టం స్పేషియల్ అనే ఆడియో ఫీచర్ తో గొప్ప లీనమయ్యే సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.
ముఖ్యంగా, ఇది సౌండ్ అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు చేసే ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ ఒప్పో బడ్స్ 2.3Mbps LHDC Lossless Audio సపోర్ట్ మరియు HI-RES Audio వైర్లెస్ సపోర్ట్ తో మీ చెవులకు ఇంపైన ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇది Dynaudio మరియు 10 బ్యాండ్ ఈక్వలైజర్ సపోర్ట్ తో కస్టమైజ్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో న్యూ బడ్స్ బ్లూటూత్ 6.1 సపోర్ట్ కలిగి ఉంది.
Also Read: అమెజాన్ GIF Sale నుంచి కేవలం 40 వేలకే 65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ అడాప్టివ్ ANC సపోర్ట్ అండ్ రియల్ టైం డైనమిక్ ANC తో చాలా క్లియర్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది AAC, SBC, LHDC, LC3 సపోర్ట్ కూడా కలిగి ఉంది. ఇది ఏఐ క్లియర్ కాల్ సపోర్ట్ తో గొప్ప క్లియర్ కాల్స్ మీకు అందిస్తుంది. ఇది 53 గంటల ప్లే బ్యాక్, కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ తో 14 గంటల ప్లే బ్యాక్ కూడా అందిస్తుంది. డ్యూరాబిలిటీ పరంగా, ఈ బడ్స్ IP55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో ఉంటుంది.