ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘Mirzapur The Movie’ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా అక్టోబర్ 30 అంటే, ఈరోజు నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, థియేటర్లలో చూసిన వారికి కూడా ఒక సర్‌ప్రైజ్ ని ఓటిటి లో అందించింది. అదేమిటంటే, థియేటర్ లలో విడుదలైన వెర్షన్ తో పోలిస్తే ఓటీటీలో అదనపు సన్నివేశాలతో కూడిన ఎక్స్ టెండెడ్ కట్ ను కూడా విడుదల చేసింది. థియేటర్లలో సినిమా చూడలేక పోయిన అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను OTT ఆస్వాదించవచ్చు.
మిర్జాపూర్: ది మూవీ సినిమా 2026 సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిధ్వానీ తమ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా కథ మీర్జాపూర్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ సమయంలో ఉన్న సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. అంటే మూడో సీజన్ తర్వాత కథను కొనసాగించే సినిమా కాకుండా, గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది.
ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి మరోసారి కాలీన్ భయ్యాగా, అలీ ఫజల్ అదే గుడ్డు పండిట్ గా, దివ్యేందు మన మున్నా త్రిపాఠి గా తిరిగి కనిపించారు. వీరితో పాటు కొత్తగా రవికిషన్, జితేంద్ర కుమార్, అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్గావ్ కర్, హర్షిత గౌర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మీర్జాపూర్ సింహాసనం కోసం జరిగే ఆధిపత్య పోరు, ప్రతీకారం, గ్యాంగ్ స్టర్ రాజకీయాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
Also Read: 5 వేల ధరలో అమెజాన్ GIF Sale ఆఫర్ చేస్తున్న బెస్ట్ 5.1 సౌండ్ బార్ డీల్ పై లోక లుక్కేద్దామా.!
ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ నిడివి ఏకంగా 3 గంటల 31 నిమిషాలు ఉంది. హిందీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. యాక్టివ్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ తో ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయిన మీర్జాపూర్ అభిమానులకు ఈ ఎక్స్ టెండెడ్ కట్ మంచి అవకాశం అవుతుంది. అంతేకాదు, థియేటర్ లో ఈ సినిమా ఇప్పటికే చూసిన వారికి కూడా మంచి సర్ప్రైజ్ అవుతుంది.
మీరు కూడా మిర్జాపూర్: ది మూవీ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లయితే, ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ ద్వారా మీరు ఈ సినిమాను వీక్షించవచ్చు.