indian mobile brand Karbonn Mobiles ready to re entry with Rebel 5G
ఒకప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ లో తన ఫోన్లతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న Karbonn Mobiles మార్కెట్లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇప్పుడు కొత్త వ్యూహంతో తిరిగి రావడానికి సిద్ధమైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. యూత్, విద్యార్థులకు మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ ని లక్ష్యంగా చేసుకుని తన కొత్త ఫోన్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. Rebel 5G తో కంపెనీ రీఎంట్రీకి సిద్ధమైనట్లు కూడా చెబుతున్నారు.
కంపెనీ అధికారిక టీజర్ వెబ్ సైట్ లో ‘Rebel’ పేరుతో కొత్త ఫోన్ ను సూచిస్తూ ‘Kamaal Koming’ ట్యాగ్ లైన్ తో ప్రచారాన్ని ప్రారంభించింది. అమెజాన్ ఇండియాలో కూడా Karbonn Rebel 5G పేరుతో మైక్రో సైట్ కనిపించింది. అయితే, ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర మరియు లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ ధరల నేపథ్యంలో భారత యూజర్లకు అందుబాటు ధరల్లో ఉపయోగకరమైన ఫీచర్లను అందించడమే తమ లక్ష్యమని జైనా గ్రూప్ సీఈఓ, ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు.
టెక్ నివేదికలు మరియు కొంత మంది టిప్ స్టర్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ లో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ ఫోన్ ను Unisoc T8200 ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా చెబుతున్నారు.
ఈ ఫోన్ లో 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఆప్షన్ వేరియంట్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఇదే కాదు ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న 6,000mAh బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే, 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని కూడా తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ మాత్రమే. ఇవేవీ ఇంకా కంపెనీ ధృవీకరించిన వివరాలు కావు. కాబట్టి వీటిని తుది స్పెసిఫికేషన్లు అని మనం పరిగణించకూడదు.
Also Read: పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రీఎంట్రీ తో లాంచ్ చేసే ఫస్ట్ ఫోన్ కాబట్టి, ఆకట్టుకునే ఫీచర్ తో బడ్జెట్ యూజర్ లను ఆకట్టుకునే ప్రైస్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కార్బన్ మొబైల్స్ లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుందో లాంచ్ నాటికి తెలుస్తోంది.