get 65 inch big QLED Smart Tv at only 55 inch tv price on flipkart sale
దీపావళి పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన కొత్త సేల్ Big Bang Diwali సేల్ నుంచి ఈరోజు అద్భుతమైన స్మార్ట్ టీవీ డీల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ ని ఈరోజు నుంచి ప్రారంభించింది మరియు ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ అందుకోవచ్చు. ఈ సేల్ నుంచి జస్ట్ 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం సేల్ మొదటి రోజే ఫ్లిప్ కార్ట్ అందించింది.
2025 మధ్య కాలంలో ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa యొక్క Y74 Pro సిరీస్ నుంచి లేటెస్ట్ గా విడుదల చేసిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (65Y74 Pro) ఈరోజు ఈ అద్భుతమైన ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 44% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 35,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ సేల్ నుంచి అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి రూ. 2,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.
Also Read: Night Charging Ban: ఇక నుంచి రైళ్లల్లో రాత్రి ఛార్జింగ్ సౌకర్యం ఉండదు .. ఎందుకంటే.!
ఈ కూకా స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ UHD 4K (3840 x 2160) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ మరియ HDR 10+వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది మరియు జతగా 2జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ OS పై నడుస్తుంది.
ఈ టీవీ రెండు బిల్ట్ ఇన్ స్పీకర్లు కలిగి 30 వాట్ సౌండ్ అని ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉండటంతో మంచి సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మరింత లీనమయ్యే సౌండ్ కోసం అడాప్టివ్ సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.