OnePlus 15R ఈరోజు అమెజాన్ GIF Sale నుంచి అత్యల్ప ధరలో లభిస్తుంది.!

HIGHLIGHTS

OnePlus 15R ఈరోజు అమెజాన్ GIF Sale నుంచి అత్యల్ప ధరలో లభిస్తుంది

యూజర్లు ఈరోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ ని చూడొచ్చు

అమెజాన్ సేల్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది

OnePlus 15R ఈరోజు అమెజాన్ GIF Sale నుంచి అత్యల్ప ధరలో లభిస్తుంది. వన్ ప్లస్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను మంచి పండుగ ఆఫర్ ధరలో అందుకోవాలని చసుఏ యూజర్లు ఈరోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ ని చూడొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

OnePlus 15R : ఆఫర్స్

వన్ ప్లస్ 14R స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 63,999 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల భారీ HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని రూ. 60,749 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరలో అందుకోవడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

OnePlus 15R : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్లు మరియు శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఇందులో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేని 165Hz రిఫ్రెష్ రేట్‌ తో అందించింది. అందుకే, ఈ ఫోన్ లో వీడియోలు చూడటం, గేమ్స్‌ ఆడటం, సోషల్‌ మీడియా బ్రౌజింగ్‌ చేయడం స్మూత్‌గా ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ తో జతగా 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ UFS 4.1 స్టోరేజ్‌ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ Android 16 ఆధారిత OxygenOS 16 పై నడుస్తుంది. ఈ ఫోన్‌లో AI ఫీచర్లు, మల్టీటాస్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. గేమింగ్‌ సమయంలో వేడిని నియంత్రించేందుకు ప్రత్యేక కూలింగ్‌ వ్యవస్థను కూడా అందించారు.

Also Read: 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ దీపావళి పండుగ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరా ఉన్నాయి. అలాగే, ఇందులో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్‌ కోసం 32MP ఫ్రంట్‌ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 4K వీడియోలను 120fps వరకు రికార్డ్‌ చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ గొప్ప ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ను 7,400mAh భారీ బ్యాటరీ మరియు 80W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తో అందించింది. అలాగే IP66, IP68, IP69, IP69K రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ నుంచి రక్షణ కల్పించే విధంగా ఈ ఫోన్ ను వన్ ప్లస్ అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :