Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది .. ఎక్కడంటే.!

HIGHLIGHTS

Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో సేల్ లభిస్తోంది

గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది

ఈ రోజు అతి తక్కువ ధరల లభిస్తున్న ఈ ఫోన్ డిల్ పైన ఒక లుక్కేయండి

Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో సేల్ లభిస్తోంది. శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన గెలాక్సీ s26 సిరీస్ యొక్క హై అండ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ రేటుకు కొనాలని ఎదురుచూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ రోజు అతి తక్కువ ధరల లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ డిల్ పైన ఒక లుక్కేయండి.

Samsung Galaxy S26 Ultra : ఆఫర్

శాంసంగ్ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్లో రూ. 1,39,999 ప్రైస్ తో అందించింది. అయితే, ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 15,000 బిగ్ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 1,24,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Amazon Pay ICICI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసి వారికి రూ. 7,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అంటే, ఈ ఫోన్ పైన అందించిన రూ. 15,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 7,000 డిస్కౌంట్ ఆఫర్ కలిపి రూ. 22,000 డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు రూ. 1,17,999 ఆఫర్ ప్రైస్ లో అందుకోవచ్చు. Buy From Here

Also Read: November 1 New Rules: మొబైల్ కాల్స్, FASTag అండ్ గ్యాస్ ధరల్లో కీలక మార్పులు.!

Samsung Galaxy S26 Ultra : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లో 6.9 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ప్లే QHD+ (3120 × 1440) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌ సెట్‌ తో నడుస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB ర్యామ్ జతగా 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో, 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (5x ఆప్టికల్ జూమ్), 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తక్కువ వెలుతురులో కూడా గొప్ప ఫోటోలు అందిస్తుంది. ఇది గరిష్టంగా 8K వీడియో రికార్డింగ్‌ కూడా సపోర్ట్ కలిగి ఉంది.

అలాగే, సెల్ఫీల కోసం ముందు 12MP కెమెరా అందించారు. ఇది AI ISP సహాయంతో వివిధ లైటింగ్ పరిస్థితుల్లో కూడా సహజమైన స్కిన్ టోన్ మరియు మెరుగైన వివరాలు పొందవచ్చు. ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంది మరియు ఇది 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 20W వైర్‌ లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :