November 1 New Rules: మొబైల్ కాల్స్, FASTag అండ్ గ్యాస్ ధరల్లో కీలక మార్పులు.!

HIGHLIGHTS

2026 నవంబర్ 1 నుంచి కొన్ని కీలక నిబంధనలు మరియు సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి

November 1 New Rules వారి రోజువారీ జీవితం పై ప్రభావం చూపే అవకాశం ఉంది

టెలికాం వినియోగదారులు, వాహనదారులు, పెన్షనర్లు, వ్యాపారులపై ప్రభావం

November 1 New Rules: దేశంలో 2026 నవంబర్ 1 నుంచి కొన్ని కీలక నిబంధనలు మరియు సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, టెలికాం వినియోగదారులు, వాహనదారులు, పెన్షనర్లు, వ్యాపారులకు ఈ మార్పు వారి రోజువారీ జీవితం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాల్ చేసిన వ్యక్తి పేరు తెలుసుకునే CNAP సదుపాయం, FASTag వార్షిక పాస్, పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ మరియు LPG సిలిండర్ ధరల రివ్యూ వంటి అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

November 1 New Rules:

మొదటగా మొబైల్ కాల్స్ కోసం టెలికాం రంగంలో Calling Name Presentation (CNAP) ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం ద్వారా మొబైల్‌ కు కాల్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తి పేరు స్క్రీన్‌ పై కనిపించే అవకాశం ఉంటుంది. సిమ్ కార్డు తీసుకునే సమయంలో అందించిన KYC వివరాల ఆధారంగా పేరు ఫోన్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయబడుతుంది.

ఈ కొత్త సర్వీస్ తో తెలియని నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ కూడా ఎవరివో గుర్తించడానికి వినియోగదారులకు కొంతవరకు సహాయపడుతుంది. అయితే, టెలికాం ఆపరేటర్ల అమలు చేసే విధానం మరియు ఫోన్ నెట్‌ వర్క్ సపోర్ట్‌ పై ఈ సర్వీస్ అందుబాటు ఆధారపడి ఉంటుంది.

FASTag Annual Pass

నవంబర్ లో రాబోతున్న మరో రూల్ Local FASTag Annual Pass. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే అర్హులైన లోకల్ వాహనదారులకు లోకల్ FASTag Annual Pass ద్వారా రాయితీ లభించనుంది. పట్టణ పరిధికి వెలుపల ఉన్న అర్హమైన టోల్ ప్లాజాల వద్ద వార్షిక పాస్ ధర రూ.1,500 గా ఉంటుంది. అయితే, మున్సిపల్ పరిధిలోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద ఇది రూ.3,000 గా ఉండనుంది. ఈ సదుపాయం కేవలం నిర్దిష్ట అర్హతలు కలిగిన నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్ని టోల్ ప్లాజాల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని యూజర్లు భావించకూడదు.

Also Read: LG 9.1.5 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ పండుగ ఆఫర్స్ అందుకోండి.!

LPG ధరలు

మరో ముఖ్యమైన అంశం LPG ధరలు. ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను రివ్యూ చేస్తారు నవంబర్ 1న కూడా 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పు ఉండవచ్చు. అయితే, ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.

చివరిగా పెన్షనర్ల అప్డేట్ కూడా నవంబర్ 1 రూల్స్ లో భాగంగా ఉంటుంది. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న 80 ఏళ్ల లోపు పెన్షనర్లు నవంబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య తమ లైఫ్ సర్టిఫికెట్‌ ను సబ్మిట్ చేయవచ్చు. బ్యాంకు శాఖలు, డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ జీవన్ ప్రమాణ్ సేవల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :