2021 జనవరి జియో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 11 Jan 2021
HIGHLIGHTS
  • జియో తన కస్టమర్లకు మరొకసారి మంచి శుభవార్త తెలిపింది.

  • జియో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్

  • మంచి ప్రయోజనాలను అందించే జియో ప్లాన్స్

2021 జనవరి జియో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్
2021 జనవరి జియో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో తన కస్టమర్లకు మరొకసారి మంచి శుభవార్త తెలిపింది. TRAI ఆదేశాల మేరకు గత సెప్టెంబర్ నుండి ఆన్ నెట్ కాల్స్ పైన లిమిట్ విధించిన జియో, ఇప్పుడు 2021 జనవరి నుండి ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా మార్చింది. అంటే, మీరు ఇప్పుడు జియో నుండి ఇతర నెట్వర్కు లకు చేసే కాల్స్ కిన్ ఎటువంటి మినిట్స్ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ గా వుంటుంది. అందుకే, మంచి ప్రయోజనాలను అందించే జియో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.                             

రిలయన్స్ జియో రూ. 129

ఈ ప్లాన్ ఎక్కువగా డేటా అవసరం లేని వారికీ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్, కేవలం రూ. 129 రూపాయల ధరలో జియో కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు నెల మొత్తానికి గాను 2 GB డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .149

రిలయన్స్ జియో యొక్క తదుపరి ప్రణాళిక గురించి మాట్లాడితే, ఈ 149 రూపాయల ప్లాన్ తో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1 జిబి డేటా మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .199

రిలయన్స్ జియో కస్టమర్లకు అత్యంత ప్రీతి పాత్రమైన ప్లానుగా ఈ 199 రూపాయల ప్లాన్ నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్లానుతో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవడమే కాకుండా, రోజుకు 1.5 జిబి డేటాతో మొత్తంగా వ్యాలిడిటీ కాలానికి గాను 42GB డేటాతో వస్తుంది మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ తో పాటుగా డైలీ 100 ఉచిత SMS లను కూడాఅందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు.

రిలయన్స్ జియో రూ .555

రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్‌ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 126 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ .2,599

రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 730 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.   

మరిన్ని ఇతర రిలయన్స్ జియో ప్లాన్స్ కోసం Click Here   

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio top 5 plans January 2021
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status