జియో నెట్‌వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం.

జియో నెట్‌వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం.
HIGHLIGHTS

చాలా సౌకర్యవంతంగా జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారవచ్చు.

కొత్త Jio Postpaid plus సిమ్ కార్డు ఇంటి వద్దకే డెలివరీ.

Jio Postpaid plus ప్లాన్స్ కేవలం రూ.399 రూపాయల నుండి ప్రారంభం అవుతాయి

జియో నెట్‌వర్క్ కి మారాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. ఇప్పటికే కొనసాగుతున్న టెలికం ఆపరేటర్ నెట్‌వర్క్ నుండి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారడానికి, వినియోగదారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, వారి డేటా లిమిట్ ని కూడా క్యారీ ఫార్వడ్ చేసుకునేందుకు వీలుగా, 'Carry Forward Your Credit Limit' అనే అద్భుతమైన అవకాశాన్ని Jio అందించింది. ఈ అవకాశంతో, ఇతర ఆపరేటర్ల పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వారి నెట్‌వర్క్  ఆపరేటర్ అందచేసే అదే క్రెడిట్ లిమిట్ తో జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ నెట్‌వర్క్ కి మరవచ్చు.

ప్రస్తుతం, ఇక టెలికం ఆపరేటర్ నుండి మరొక టెలికం ఆపరేటర్ కి మారడానికి వినియోధారులు ఎక్కువగా తమ క్రెడిట్ లిమిట్ గురించి ఆలోచించే వారు. అయితే, జియో ఈ అంతరాన్ని తగ్గించింది. జియో ప్రకటించిన 'Carry Forward Your Credit Limit' తో చాలా సౌకర్యవంతంగా  జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కి మారవచ్చు.  అంతేకాదు, ఈ విధంగా మారడానికి ఎటువంటి రుసుమును లేదా ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదని జియో తెలిపింది.    

Jio Postpaid plus కి మారడానికి ఏమి చెయ్యాలి?

ఇప్పటికే వాడుతున్న పోస్ట్ పెయిడ్ ఆపరేటర్ నుండి Jio Postpaid plus కి మారడానికి ఈ విధంగా చెయ్యాలి.        

ముందుగా, మీ వాట్సాప్ నుండి 88501-88501 నంబర్ కు 'Hi' అని వాట్సాప్ మెసేజీని పంపాలి. తరువాత, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పోస్ట్ పోస్ట్ పెయిడ్ ఆపరేటర్ యొక్క బిల్ ను కూడా పంపించాలి/అప్లోడ్ చేయాలి. తరువాత, చివరిగా యూజర్లు తమ కొత్త Jio Postpaid plus సిమ్ కార్డును జియో స్టోర్ నుండి లేదా తమ ఇంటి వద్దకే డెలివరీ చేసుకునే అవకాశం వుంది.

Jio Postpaid plus ప్లాన్స్ కేవలం రూ.399 రూపాయల నుండి ప్రారంభం అవుతాయి మరియు అన్ని ప్లాన్స్ కూడా ప్రధాన OTT ప్లాట్ఫామ్స్ అయినటువంటి Netflix, Amazon Prime, Disney+ Hotstar కి ఉచిత చందాతో వస్తాయి.     

మీరు జియో కస్టమర్ అయితే, మీ నంబర్‌కు అందుబాటులో ఉన్న లేటెస్ట్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇక్కడ చూడండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo