Jio OTT Pass comes with JioHotStar and prime video Like 15 otts and more benefits
JioHotStar మరియు ప్రైమ్ వీడియో వంటి 15 కంటే ఎక్కువ OTT లు అందించే Jio OTT Pass గురించి తెలుసా? ఒకవేళ తెలియకపోతే, ఈరోజు కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చులో 15 OTT యాక్సెస్ మరియు 1000 కి పైగా లైవ్ చానల్స్ ను ఈ జియో ఓటీటీ పాస్ ద్వారా పొందవచ్చు. మరి జియో ఈ సరికొత్త ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందామా.
ప్రస్తుతం డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. అందుకే, అన్ని టెలికాం కంపెనీలు కూడా OTT తో బండిల్ చేసిన ప్లాన్స్ అందించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ తరుణంలో జియో కొత్తగా ఓటీటీ పాస్ ఆఫర్ ను అందించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉంటుంది. ఈ ప్లాన్ తో చాలా తక్కువ ఖర్చులో OTT లో ఎక్కువ కంటెంట్ చూడాలనుకునే వారికి జియో ఓటీటీ పాస్ ఒక గొప్ప ఆప్షన్ అవుతుంది.
జియో ఓటీటీ పాస్ ని కేవలం రూ. 200 రూపాయల రీఛార్జి తో జియో అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లు జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ ప్రీమియం వంటి 15 ప్రముఖ ఓటీటీ యాప్స్ యాక్సెస్ తో పాటు 1000 కి పైగా లైవ్ చానల్స్ నేరుగా మొబైల్ లో చూడవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో నెల మొత్తానికి సరిపడా డేటా కూడా లభిస్తుంది.
Also Read: LG Dolby Atmos స్మార్ట్ టీవీని కేవలం రూ. 17,499 రూపాయలకే అందుకోండి.!
జియో ఓటీటీ పాస్ తో యూజర్లు జియో టీవీ మొబైల్ యాప్ 15 OTT యాప్స్ కి యాక్సెస్ అందుకుంటారు. ఇందులో జియో హాట్ స్టార్, Sun NXT, లయన్స్ గేట్ ప్లే, SonyLIV, Zee5, డిస్కవరీ ప్లస్, చౌపల్, Fan Code, కంచె లంక, ప్లానెట్ మరాఠి, తరంగ్ ప్లస్, టైమ్స్ ప్లే మరియు Hoichoi యాప్స్ కి యాక్సెస్ పొందుతారు. అంతేకాదు, మై జియో ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యాక్సెస్ మరియు యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా మీకు లభిస్తుంది.
ఇదే ప్లాన్ తో యూజర్లు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా సన్ టీవీ నెట్ వర్క్, Warner Bros, జియో స్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, ఈటీవీ వంటి 1000 కి పైగా లైవ్ ఛానల్ ను కూడా వీక్షించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ తో 30GB హై స్పీడ్ డేటా 28 రోజులు చెల్లుబాటు కూడా లభిస్తుంది.