ఈ Jio Best Plan తో జియో రోజుకు కేవలం రూ. 10 ఖర్చుతోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తోంది.!
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది
Jio Best Plan తో రోజుకు కేవలం రూ. 10 ఖర్చుతోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తోంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది
టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం ఎక్కువ మొత్తాన్ని చెల్లించవలసి వస్తోంది. అందుకే, జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను కూడా అందించింది. వీటిలో ఒక Jio Best Plan తో జియో రోజుకు కేవలం రూ. 10 ఖర్చుతోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తోంది. జియో యూజర్లకు తక్కువ ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలను ఈ బెస్ట్ ప్రీపెయిడ్ గురించి తెలుసుకుందాం.
ఏమిటా Jio Best Plan?
రిలయన్స్ జియో రీసెంట్ గా అందించిన 98 రోజుల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 999 రూపాయల ప్లాన్ జియో బేస్ బడ్జెట్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తాన్ని రోజు వారీగా లెక్కిస్తే రోజుకు కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.
జియో రూ. 999 ప్లాన్ ప్రయోజనాలు
ఇక ఈ జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు చూస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 98 రోజుల చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు Jio True 5G నెట్వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ చేస్తుంది. అదే 4G నెట్వర్క్ పై అయితే రోజు 2GB డేటా చొప్పున 196GB ల డేటా అందిస్తుంది.
ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ప్రతిరోజు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అంతేకాదు, జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు యాక్సెస్ ఉచిత ఆఫర్ చేస్తుంది. మూడు నెలలు చెల్లుబాటు అయ్యే ప్రీపెయిడ్ ప్లాన్ కోరుకునే జియో యూజర్లకు అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఈ ప్లాన్ కూడా ఒకటి అవుతుంది.
Also Read: Vivo V50: ట్రిపుల్ 50MP కెమెరా మరియు అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!
మరిన్ని జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here