Vivo V50: ట్రిపుల్ 50MP కెమెరా మరియు అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!
వివో కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V50 లాంచ్ అనౌన్స్ చేసిన వివో
V50 ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెట్టింది
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ ప్రారంభించింది
Vivo V50: వివో కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వివో ఇప్పుడు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెట్టింది. ఈ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు వివో టీజింగ్ మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు చెబుతోంది. మరి ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి వివో చెబుతున్న విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
Vivo V50 : లాంచ్
వివో వి 50 స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా వెల్లడించక పోయినా ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో మాత్రం టీజింగ్ ప్రారంభించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క డిజైన్, కెమెరా మరియు బ్యాటరీ వంటి మరిన్ని వివరాలు కంపెనీ ఇప్పటికే టీజర్ ద్వారా అందించింది.
Vivo V50 : ఫీచర్స్
వివో వి50 స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుందని వివో వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుందని కూడా తెలియ చేసింది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ 50MP + 50MP ZEISS డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో పాటు ముందు కూడా 50MP గ్రూప్ సెల్ఫీ ZEISS కెమెరా కలిగి ఉంటుంది.
ఇది OIS సపోర్ట్ మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది. ఇది ఇండియన్ వెడ్డింగ్ కోసం ప్రత్యేకమైన పోర్ట్రైట్ ఫిల్టర్స్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా వివో చెబుతోంది. ఇది కాకుండా V50 స్మార్ట్ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి భారీ ఫీచర్స్ ఉన్నట్లు కూడా తెలిపింది.
Also Read: iQOO Neo 10R: లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
ఇంత పెద్ద బ్యాటరీ మరియు కర్వుడ్ డిస్ప్లే కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 7.39 మందంతో చాలా స్లీక్ గా ఉంటుందని కూడా వివో తెలియ చేసింది. ఈ ఫోన్ లో ఆరా రింగ్ లైట్ కూడా వుంది. ఈ అప్ కమింగ్ వివో ఫోన్ ను రోజ్ రెడ్, స్టారీ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు కలర్స్ లో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇవి కాకుండా ఈ ఫోన్ IP68 మరియు IP69 తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా త్వరలోనే అందిస్తుంది కాబోలు.