iQOO Neo 10R: లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
ఐకూ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ వెల్లడించింది
ఆకట్టుకునే డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందిస్తుందని టీజర్ చెబుతోంది
iQOO Neo 10R కీలకమైన వివరాలు కూడా కన్ఫర్మ్ చేసింది
iQOO Neo 10R: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను ఐకూ ఈరోజు వెల్లడించింది. నిన్నటి వరకు కేవలం ఈ ఫోన్ యొక్క డిజైన్ వివరించే ఇమేజ్ తో మాత్రమే టీజింగ్ అందించిన కంపెనీ ఈరోజు లాంచ్ డేట్ మరియు కీలకమైన వివరాలు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందిస్తుందని కంపెనీ అందించిన కొత్త టీజర్ చూసిన వారు అంచనా వేస్తున్నారు.
iQOO Neo 10R: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను 11 మార్చి 2025 వ తేదీ ఇండియాలో విడుదల చేస్తుందని ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో చాలా వేగవంతమైన ఫోన్ అవుతుందని ఐకూ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. అమెజాన్ ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి కూడా అందించింది.
iQOO Neo 10R: కీలకమైన ఫీచర్స్
ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 1.7 Mn+ AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా ఈ తెలిపింది. ఇది ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ ను తెలిపింది మరియు ఈ సెగ్మెంట్ లో అని హింట్ కూడా ఇచ్చింది. అంటే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఈ చిప్ సెట్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని అర్ధం.
ఈ ఫోన్ డిస్ప్లే గురించి కూడా చిన్న హింట్ ఇచ్చింది. అదేమిటంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఏకంగా 2000Hz ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కలిగి స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు టీజర్ ఇమేజెస్ ద్వారా అర్థం అవుతోంది. ఈ ఫోన్ కొత్త ర్యాగింగ్ బ్లూ కలర్ లో మరియు వెనుక కొత్త కెమెరా సెటప్ తో కనిపిస్తోంది.
Also Read: Boult Drift Max స్మార్ట్ వాచ్ ని పెద్ద HD స్క్రీన్ మరియు IP68 రేటింగ్ తో చవక ధరలో లాంచ్ చేసింది.!
ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను ఒక్కటిగా వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ మరియు కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.