Jio Offer for daily 3gb heavy data for 3 days know the plans
Jio Offer: కేవలం రూ. 39 రూపాయలకే డైలీ 3GB డేటా అందించే ప్లాన్ గురించి మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకుండా ఈరోజు ఈ ప్లాన్ గురించి తెలుసుకోండి. కేవలం ఇది మాత్రమే కాదు రూ. 11 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా మరియు కేవలం రూ. 49 రూపాయలకే 25 జీబీ హై స్పీడ్ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కూడా జియో ఆఫర్ చేస్తోంది. జియో అందించిన ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందామా.
రిలయన్స్ జియో యూజర్లకు చాలా బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది. వీటిలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లు కేవలం రూ. 50 కంటే తక్కువ రీఛార్జ్ తో చాలా మంచి డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. అయితే, ఇవి మెయిన్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కావు కేవలం డేటా మాత్రమే అందించే ‘డేటా ఓన్లీ పాక్స్’ అని గమనించాలి.
ఇందులో 1 గంట అన్లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ అందించే రూ. 11 డేటా ప్లాన్ మొదలుకొని మూడు రోజులు డైలీ 3 జీబీ హై స్పీడ్ ఈటా అందించే రూ. 39 రూపాయల వరకు డేటా వోచర్ ఉన్నాయి.
ఇది జియో ఆఫర్ చేస్తున్న అత్యంత చవకైన అన్లిమిటెడ్ డేటా ప్లాన్. ఈ ప్లాన్ తో ఒక గంట వినియోగించుకోవచ్చు. అతి తక్కువ ధరలో పరిమిత సమయానికి అన్లిమిటెడ్ డేటా కోరుకునే వారికి ఈ డేటా ప్లాన్ చక్కగా సరిపోతుంది.
ఇది జియో ఆఫర్ చేస్తున్న ఒకరోజు అన్లిమిటెడ్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్. రూ. 49 డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఒక రోజు మొత్తం డేటా ఆఫర్ చేస్తుంది. అయితే, హై స్పీడ్ డేటా లిమిట్ 25 జీబీ వరకు మాత్రమే అందిస్తుంది. ఈ డేటా ముగిసిన తర్వాత 64Kbps వేగంతో అన్లిమిటెడ్ ఆఫర్ చేస్తుంది. ఒకరోజు మొత్తం అన్లిమిటెడ్ డేటా కోరుకునే యూజర్లకు ఈ డేటా ప్లాన్ చక్కగా సరిపోతుంది.
Also Read: విలక్షణమైన సెటప్ తో కొత్త 7.1.2 Dolby Atmos అండ్ DTS సౌండ్ బార్ అందించిన Zebronics
ఇది జియో యూజర్ల కోసం ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ గా యూజర్లు చెబుతారు. ఎందుకంటే, ఈ డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మూడు రోజుల పాటు రోజుకు 3జీబీ హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం మూడు రోజులకు గాను 9 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. అంతేకాదు, ఈ డేటా ప్లాన్ తో వచ్చే 3 జీబీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 64Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.
ఒక పరిమిత సమయానికి వేగవంతమైన అధిక డేటా కోరుకునే యూజర్ల కోసం ఈ బడ్జెట్ డేటా ఓన్లీ ప్యాక్స్ చక్కగా సరిపోతాయి.