విలక్షణమైన సెటప్ తో కొత్త 7.1.2 Dolby Atmos అండ్ DTS సౌండ్ బార్ అందించిన Zebronics

HIGHLIGHTS

Zebronics ఇండియన్ మార్కెట్లో మరొక ప్రీమియం సౌండ్ బార్ ని లాంచ్ చేసింది

ఈ సౌండ్ బార్ ని విలక్షణమైన 7.1.2 Dolby Atmos అండ్ DTS సెటప్ తో అందించింది

సినిమా థియేటర్స్ స్థాయి 3D సరౌండ్ సౌండ్ ని ఈ సౌండ్ బార్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Zebronics ఇండియన్ మార్కెట్లో మరొక ప్రీమియం సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ని విలక్షణమైన 7.1.2 Dolby Atmos అండ్ DTS సెటప్ తో అందించింది. ఈ కొత్త సౌండ్ బార్ లో ఫ్రంట్ ఫైరింగ్, అప్ ఫైరింగ్, సైడ్ ఫైరింగ్ మరియు సైడ్ అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ని అందించింది. ఈ విలక్షణమైన సెటప్ తో సినిమా థియేటర్స్ స్థాయి 3D సరౌండ్ సౌండ్ ని ఈ సౌండ్ బార్ అందిస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది. మరింత మంచి విషయం ఏమిటంటే, ఈ సౌండ్ బార్ పైన అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ మంచి సేల్ ఆఫర్లు కూడా ప్రకటించాయి.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్

గత సంవత్సరం BAR 9920 పేరుతో 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ని అందించిన జెబ్రోనిక్స్, ఇప్పుడు Juke Bar 9925 పేరుతో ఈ కొత్త 7.1.2 డాల్బీ అట్మోస్ అండ్ డిటిఎస్ సౌండ్ బార్ ని అందించింది. ఈ సౌండ్ బార్ ని MRP 94,999 ట్యాగ్ తో మరియు రూ. 26,999 సేల్ ప్రైస్ తో లాంచ్ చేసింది.

ఈ సౌండ్ బార్ పై ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి మంచి డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ రూ. 1,750 రూపాయల Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అందించగా, రూ. 1,750 రూపాయల HDFC క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,249 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఆఫర్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read: 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించిన ఫ్లిప్ కార్ట్.!

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్

ఇది జెబ్రోనిక్స్ రిలీజ్ చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ 7.1.2 ఛానల్ సెటప్ ని కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో సపరేట్ శాటిలైట్ స్పీకర్లు వంటివి ఏమీ ఉండదు. అయితే ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ఈ కంప్లీట్ స్పీకర్ సెటప్ ని అందించింది. ఈ సెటప్ లో ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు, సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు, పైన స్ట్రైట్ అప్ ఫైరింగ్ స్పీకర్ మరియు రెండు సైడ్ అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. అంతేకాదు, డీప్ అండ్ రిచ్ సౌండ్ అందించే బిగ్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఇది ఇంటిని చుట్టేసే మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.

ఈ సౌండ్ బార్ కలిగిన ఈ సూపర్ సెటప్ తో పాటు ఇందులో డాల్బీ అట్మోస్ మరియు డిటిఎస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను అందించింది. ఇది మాత్రమే కాదు కంపెనీ యొక్క ప్రత్యేకమైన Zeb Acousti Max సౌండ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ మరియు 950W అవుట్ పుట్ తో ఇది సినిమా థియేటర్ స్థాయి సౌండ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. HDMI eArc, USB, ఆప్టికల్, టైప్ C, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :