జియో సునామి: చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించిన జియో

HIGHLIGHTS

జియో కస్టమర్ల కోసం అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

336 రోజుల వ్యాలిడిటీ

అన్లిమిటెడ్ ప్రయోజనాలతో వస్తుంది

జియో సునామి: చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించిన జియో

జియో కస్టమర్ల కోసం అత్యంత చవకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ ప్రయోజనాలతో వస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ రీఛార్జ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ ను రూ .749 రూపాయల ధరలో అందించింది. అయితే, ఈ ప్లాన్  ను జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రకటించింది. ఇది జియోఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ లో చవకైనది. ఈ ప్లాన్ ఎటువంటి లాభాలను అందిస్తోందో తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో రూ .749 ప్లాన్

జియో యొక్క ఈ లేటెస్ట్ ఆల్ ఇన్ వన్ ప్లాన్ జియోఫోన్ యూజర్ల కోసం ప్రకటించబడింది. ఈ ప్లాన్ 12 నెలలకు నెలకు 28 రోజుల చొప్పున మొత్తం 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రూ .749 ప్లాన్ తో అన్ని నెటవర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందుతుంది. అలాగే, నెలకు (28రోజులకు) 2GB హై స్పీడ్ డేటా చొప్పున 12 నెలలకు(12×28) లకు మొత్తం 24GB డేటాని తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో 28 రోజులకు 50 SMS లను కూడా అఫర్ చేస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఇక రీసెంట్ గా జియో ప్రకటించిన మరొక బెస్ట్ ప్లాన్ గురిఞ్చి మాట్లాడితే, జియో యొక్క రూ.75 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను జియోఫోన్ యూజర్ల కోసం ప్రకటించింది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ని తీసుకువస్తుంది. అధనంగా, 200 MB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ఇదే అతి తక్కువ ధర ఆల్ ఇన్ ఇన్ వన్ ప్లాన్ అవుతుంది. 

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo