Jio Best Plans: రూ.100 కంటే తక్కువ రేటుకే అధిక లాభాలనిచ్చే బెస్ట్ ప్లాన్స్

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటా

ఈ జియో ప్లాన్స్ కస్టమర్లకు అధిక లాబాన్నిస్తాయి

Jio Best Plans: రూ.100 కంటే తక్కువ రేటుకే అధిక లాభాలనిచ్చే బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం తక్కువ రేటుకే మూడు బెస్ట్ ప్లాన్స్ ప్రకటించింది. వీటిలో రెండు కొత్త డబుల్ బెనిఫిట్స్ ప్రీపెయిడ్  ప్లాన్స్ మరియు మరొకటి పాత ప్రీపెయిడ్ ప్లాన్ ని తిరిగి ప్రకటించింది. అధిక లాభాలతో ఈ రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ మూడు ఈ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ డేటాతో వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio 39 ప్లాన్ ప్రయోజనాలు

ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39  మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.

Jio 69 ప్లాన్ ప్రయోజనాలు

ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై  స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.

Jio 98 ప్లాన్ ప్రయోజనాలు

ఈ  Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.

మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo