Jio 299 Plan: యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన రిలయన్స్ జియో.!

HIGHLIGHTS

జియో యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది

రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో నిలిపివేస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి

ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉంటుందని జియో వెల్లడించింది

Jio 299 Plan: కొన్ని రోజులుగా న్యూస్ లో వస్తున్న అనేక కథనాలకు చెక్ పెడుతూ, జియో యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో నిలిపివేస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను క్లోజ్ చేయడం లేదని మరియు ఈ ప్లాన్ అందరికీ అందుబాటులో ఉంటుందని జియో వెల్లడించింది.

Jio 299 Plan: వైరల్ న్యూస్

జియో చాలా కాలంగా కొనసాగిస్తున్న బడ్జెట్ 4G అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 299 ని జియో కంటిన్యూ చేయడం లేదని న్యూస్ నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ ప్లాన్ 28 రోజు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది మరియు ఈ ప్లాన్ 4G నెట్ వర్క్ కోసం అందించిన అన్లిమిటెడ్ ప్లాన్. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను క్లోజ్ చేయడం లేదని మరియు ఈ ప్లాన్ ను కొనసాగిస్తున్నట్లు జియో తెలిపింది.

ఇది కాకుండా జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ లాభాలతో పాటు ఉచిత ఏఐ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ తో అందిస్తోంది. ఈ ప్లాన్ తో బాగా అటాచ్ ఉన్న జియో యూజర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది. అయితే, మరో రూ. 50 ఖర్చు చేస్తే అన్లిమిటెడ్ 5G లాభాలు అందించే రూ. 349 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చని కూడా జియో చెబుతోంది.

Jio 299 Plan: ప్రయోజనాలు ఏమిటి?

జియా యొక్క ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందుకుంటారు. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 1.5GB హాయ్ స్పీడ్ 4G డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 60Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటాని ఉపయోగించుకోవచ్చు.

అంటే, ఓవరాల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. అయితే, మరో రూ. 50 ఖర్చు చేస్తే అన్లిమిటెడ్ 5జి బెనిఫిట్స్ అందించే రూ. 349 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను పొందవచ్చు. ఈ అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ ఇక్కడ చూడొచ్చు.

Also Read: జబర్దస్త్ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 QLED Smart Tv లభిస్తోంది .. ఎక్కడంటే.!

జియో రూ. 349 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ. 349 ప్లాన్ ప్రయోజనాల ఈ ప్రీపెయిడ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీ మరియు ఈ పూర్తి కాలానికి అన్లిమిటెడ్ 5జి డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా 4జి నెట్ వర్క్ పై కూడా డైలీ 2GB డైలీ డేటా బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. అలాగే, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా ఆఫర్ చేస్తుంది.

పైన తెలిపిన రెండు ప్లాన్ లు కూడా 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ఏఐ ప్రో ప్రీమియం యాక్సెస్ ని కూడా అందిస్తాయి. అలాగే, జియో టీవీ మరియు జియో ఏఐ క్లౌడ్ ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :