జియో ధమాకా అఫర్: రూ.75 రూపాయలకే అన్లిమిటెడ్ సర్వీస్

HIGHLIGHTS

జియో ధమాకా అఫర్ తీసుకొచ్చింది

ఈ ప్లాన్ తో ఎక్కువ లాభాలను అఫర్ చేస్తోంది

200 MB అదనపు డేటాను అందిస్తుంది

జియో ధమాకా అఫర్: రూ.75 రూపాయలకే అన్లిమిటెడ్ సర్వీస్

జియో తన కస్టమర్ల కోసం జియో ధమాకా అఫర్ తీసుకొచ్చింది. రూ.75 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో ఎక్కువ లాభాలను అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ఇది ను జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.  ఈ వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 0.1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 50 SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ని తీసుకువస్తుంది. అధనంగా, 200 MB అదనపు డేటాను అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక జియోఫోన్ బెస్ట్ ఆఫర్ల విషయానికి వస్తే, జియోఫోన్ 2021 ఆఫర్ తో జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అధనంగా, జియోఫోన్ ఉచితంగా లభిస్తుంది.

అంతేకాదు, పైన తెలిపిన అన్లిమిటెడ్  ప్రయోజనాలతో  కేవలం ఒక్క సంవత్సరం వ్యాలిడిటీ మాత్రమే కోరుకుంటే, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ క్రింద రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, ఉచిత జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు నెలకు 2 జిబి హై-స్పీడ్ డేటా 12 నెలలకు ఉంటాయి.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

మరిన్ని జియో ఆఫర్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo