జియో బెస్ట్ సెల్లర్ ప్లాన్స్: 730GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్

జియో బెస్ట్ సెల్లర్ ప్లాన్స్: 730GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్
HIGHLIGHTS

జియో అన్ని ప్రయోజాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్

డైలీ 2GB హై స్పీడ్ డేటా

అన్లిమిటెడ్ కాలింగ్

జియో అన్ని ప్రయోజాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా అందించింది. కానీ, రోజు అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో  పాటుగా దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్రయోజాలను అఫర్ చేసే ప్లాన్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. వీటిలో, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు.

ఎందుకంటే, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని, అన్లిమిటెడ్ కాలింగ్, మరియు డైలీ 100 ఉచిత SMS సర్వీస్ మరియు  వీటితో పాటుగా కాంప్లిమెంటరి క్రింద అన్ని జియో యాప్స్ కి సబ్స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 365 రోజులకి గాను రోజుకు 2GB డేటాతో మొత్తంగా 730GB ల హై స్పీడ్ డేటాని అందిస్తుంది.   

ఇక జియో లేటెస్ట్ బెస్ట్ అఫర్ విషయాని వస్తే, జియో కొత్త జియోఫోన్ 2021 ఆఫర్ ను ప్రకటించింది. దీనితో కొత్త జియోఫోన్ తో ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి.

కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కాదు, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo