Jio Best Plans: మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది
మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్
యూజర్లకు అధిక లాభాలను అందించే జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్
Jio Best Plans: రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత పెరిగిన రేటు తో పాటు యూజర్లకు అధిక లాభాలను అందించేలా కొన్ని ప్లాన్ లను కూడా తీసుకు వచ్చింది. ఇందులో, మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్ రెండు ఉన్నాయి. జియో ఆఫర్ చేస్తున్న ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను ఈరోజు చూద్దాం.
SurveyJio Best Plans
రిలయన్స్ జియో ఇటీవల తీసుకు వచ్చిన రూ. 899 మరియు రూ. 999 రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
Also Read: Vivo V40 Series లాంచ్ డేట్ వచ్చేసింది.. ఒక రేంజ్ కెమెరా సెటప్ తో వస్తోంది.!
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2GB డేటా + 20 GB ఎక్స్ట్రా డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ గా 90 రోజులకు 200GB డేటా లభిస్తుంది. అలాగే, డైలీ 100SMS వినియోగ ల ప్రయోజనం మరియు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా సౌకర్యం కూడా అందిస్తుంది.

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్
జియో యొక్క ప్లాన్ ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీ ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 98 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇది కాకుండా, రోజు 100SMS వినియోగం మరియు 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా ని కూడా పొందవచ్చు.
పైన తెలిపిన ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లతో రీఛార్జ్ చేసే యూజర్లు జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ ను కూడా పొందుతారు.
మొబైల్ రీఛార్జ్ మరియు ప్రీపెయిడ్ ప్లాన్ లను చెక్ చేయడానికి Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile