Jio Best Plan: ప్రస్తుతం ఒక మొబైల్ నెంబర్ ను మైంటైన్ చేయాలంటే అది ఒక పెద్ద సమరం అవుతోంది. అయితే, నెలకు కేవలం రూ. 300 ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలతో పాటు అధిక లాభాలు కూడా అందుకోవాలంటే, జియో అందించిన ఈ బెస్ట్ ప్లాన్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జియో యూజర్ల కోసం అందించిన రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్లకు చాలా తక్కువ ఖర్చుతో కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తాయి. మరి ఈ రెండు జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Jio Best Plan: ఏమిటి ఈ ప్లాన్స్?
జియో చాలా కాలంగా ఆఫర్ చేస్తున్న రూ. 899 మరియు రూ. 999 రూపాయల రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఈ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అవుతాయి. ఎందుకంటే, ఈ రెండు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా కూడా 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఇక ఈ ప్లాన్స్ కోసం చెల్లించే అమౌంట్ ను నెలకు లెక్కిస్తే, అది కేవలం రూ. 300 రూపాయలు మాత్రమే అవుతుంది.
అంటే, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా నెలకు కేవలం రూ. 300 రూపాయల చెల్లింపుతో మీకు అన్లిమిటెడ్ లాభాలు తీసుకొస్తాయి. మరి జియో అందించిన ఈ రెండు బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు వివరంగా చూద్దాం.
రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించిన దీర్ఘకాలిక అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గా ఇది నిలుస్తుంది. ఈ మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు కేవలం రూ. 300 ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఒకటిగా ఉంటుందని జియో యూజర్లు నమ్ముతారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS వంటి లాభాలు అందుతాయి. ఇది కాకుండా 4జి నెట్ వర్క్ మీద డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటాతో పాటు 20 జీబీ అదనపు ఉచిత డేటా కూడా ఆఫర్ చేస్తుంది. ఇదే కాదు, రూ. 3,500 రూపాయల విలువ చేసే 18 నెలల జెమిని ప్రో AI యాక్సెస్ ను కూడా ఉచితంగా యూజర్లకు అందిస్తుంది.