Jio Best Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం అన్ని కేటగిరీలలో చాలా ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో, కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందిస్తాయి. మరిన్ని బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు వాటిలో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోనున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
Jio Best Plan: ఏమిటా ప్లాన్?
రిలయన్స్ జియో టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత కూడా యూజర్లను ఆకట్టుకునే ఒక ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. అదే, రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా యూజర్ల మన్ననలు అందుకుంది.
జియో యొక్క బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతున్న రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది.
అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా చొప్పున 180 GB డేటా మరియు 20GB అదనపు డేటా తో కలిపి మొత్తం 200GB డేటా కూడా అందిస్తుంది. జియో ఈ ప్లాన్ ను జియో బెస్ట్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ గా వర్ణిస్తోంది. ఈ ప్లాన్ తో జియో టీవీ మరియు జియో క్లౌడ్ రెండు యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.