Jio
టెలికాం రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో Jio ఒకటిగా నిలుస్తుంది. అందరి కంటే ముందుగా 4G మరియు 5G నెట్ వర్క్ ని పరిచయం చేసిన జియో తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా కలిగి ఉంది. ఇలాంటి గొప్ప ప్లాన్స్ అందించడం ద్వారా కోట్లాది మంది వినియోగదారులు జియో సేవలను ఉపయోగిస్తున్నారు. ఏడాది మొత్తం మొత్తం నెంబర్ యాక్టివ్ ఉంచుతూ రోజుకి 2GB డేటా ఆన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా జియో అందించింది. లాంగ్ వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే ఈ ప్లాన్ బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది.
జియో యూజర్ల కోసం అందించిన రూ.3599 ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే యూజర్లకు మంచి ప్లాన్ అవుతుంది. ఈ ప్లాన్ లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఒకసారి రీఛార్జ్ చేస్తే చేస్తే సంవత్సరం మొత్తం నెంబర్ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రమే కాదు అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలు అందిస్తుంది.
Also Read: HMD Vibe 2 5G: బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ మరియు బిల్ట్ AI తో రిలీజ్ అయ్యింది.!
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, డైలీ 2.5GB వేగవంతమైన 4G డేటా మరియు 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. మొత్తం కలిపి సంవత్సరానికి భారీ మొత్తంలో డేటాని వినియోగించుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే మరో లాభం కాలింగ్. ఈ ప్లాన్ తో దేశవ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ ఈ ప్లాన్ మీకు అందిస్తుంది.
ప్రతిరోజూ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. బ్యాంకింగ్ OTP లు, పర్సనల్ మెసేజ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ తో జియో అందించింది. ఈ ప్లాన్ తో 3 నెలల జియో హాట్ స్టార్ యాక్సెస్, Jio టీవీ యాక్సెస్ మరియు జియో క్లౌడ్ యాక్సెస్ కూడా అందిస్తుంది.
ముఖ్యంగా, ఈ పాన్ తో రూ. 35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. దీంతో గూగుల్ జెమినీ నానో బనానా మరియు గూగుల్ వీడియో క్రియేటర్స్ Veo వంటి మరిన్ని ప్రీమియం ఫీచర్స్ కి యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి, ఈ జియో వన్ ఇయర్ ప్రీపెయిడ్ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గా నిలుస్తుంది.