HMD Vibe 2 5G: బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ మరియు బిల్ట్ AI తో రిలీజ్ అయ్యింది.!
HMD Vibe 2 5G: గత కొంత కాలంగా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయకుండా నిమ్మళంగా ఉన్న HMD ఎట్టకేలకు ఈరోజు కొత్త 5జి స్మార్ట్ ఫోన్ వైబ్ 2 ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మరింత మంచి విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో బిగ్ బ్యాటరీ మరియు బిల్ట్ AI తో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyHMD Vibe 2 5G: ప్రైస్
హెచ్ఎండి వైబ్ 2 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ 4GB + 64GB వేరియంట్ ను ఈ ధరతో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ను రూ. 11,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కాస్మిక్ లావెండర్, నార్డిక్ బ్లూ మరియు పీచ్ పింక్ మూడు రంగుల్లో లభిస్తుంది. మే 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా హెచ్ఎండి ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ని కూడా అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే ఒకసారి లభిస్తుంది. ఈ ఫోన్ ను Axis, SBI, HDFC మరియు ICICI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: OPPO Find X9s: ఒప్పో లేటెస్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
HMD Vibe 2 5G: ఫీచర్స్
హెచ్ఎండి వైబ్ 2 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD+ IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది మరియు 2.5D కర్వుడ్ గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను Unisoc లేటెస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మంచి స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది.
కెమెరా పరంగా, హెచ్ఎండి వైబ్ 2 ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ HDR, AI సీన్ రికగ్నైజేషన్, UHD వంటి కెమెరా ఫీచర్స్ తో పాటు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ ఇండస్ AI తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile