Install App Install App

Jio జబర్దస్త్ ప్లాన్: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Oct 2021 | అప్‌డేట్ చేయబడింది పైన 24 Oct 2021
HIGHLIGHTS
  • అన్లిమిటెడ్ లాభాలను అంతరాయం లేకుండా అందుకోవచ్చు

  • డైలీ 3GB హై స్పీడ్ డేటా

  • కస్టమర్ల కోసం జియో మంచి ప్లాన్ అందించింది

Jio జబర్దస్త్ ప్లాన్: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు
Jio జబర్దస్త్ ప్లాన్: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం డైలీ 3GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు

ప్రస్తుత ఆన్లైన్ యుగంలో అవసరం ఏదైనా ప్రతిదానికి అధిక డేటా అవసరం అవుతుంది. అంటే, ఆన్లైన్ క్లాస్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా  చాటింగ్ లేదా గేమింగ్ అవసరం ఏదైనా వీటన్నిటికీ ఇంటర్నెట్ కావాలి;అవసరం. అయితే, నెల నెల రీఛార్జ్ చేసే కంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలను అంతరాయం లేకుండా అందుకోవచ్చు. 

అందుకే, ఇలాంటి అవసరమున్న కస్టమర్ల కోసం జియో మంచి ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే సంవత్సరమంతా డైలీ 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

అదే రూ.3499 జియో ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ మీకు అధిక డేటా మరియు మరిన్ని లాభాలను అందిస్తుంది. ఆన్లైన్ క్లాసులు మరియు ఆన్లైన్ కంటెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా రోజువారీ సరిపోయెలా ఈ ప్లాన్ ఉంటుంది. అందుకే, రూ.3499 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చే అన్ని లాభాలను చూద్దాం.

Jio Rs.3499 Plan 

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అలాగే, జియో కస్టమర్లకు అధిక లాభాలను ఇచ్చే లేటెస్ట్ మరియు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఈ క్రింద చూడవచ్చు.  

Jio Rs.597 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs.2397 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 365 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here     

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio best long validity plan with unlimited uses
Install App Install App
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status