రోజుకి 12 రూపాయలకే 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్!! జియో బెస్ట్ ప్లాన్!

HIGHLIGHTS

జియో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

డైలీ 3GB హై స్పీడ్ 4G డేటా

అన్లిమిటెడ్ కాలింగ్

రోజుకి 12 రూపాయలకే 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్!! జియో బెస్ట్ ప్లాన్!

జియో కస్టమర్లకు రోజుకి 12 రూపాయలకే 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను అందించే బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ గురించి ఈరోజు చూద్దాం. ఈ ప్లాన్ కేవలం 349 రూపాయలకే ఈ ప్రయోజనాలన్నింటిని అందిస్తుంది. అంతేకాదు, ఇలాంటిదే మరొక ప్లాన్ కూడా వుంది. మరి ఆ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రిలయన్స్ జియో యొక్క రూ.349 రూపాయల ప్లాన్ అధిక డేటా ప్రయోజనంతో వస్తుంది. రోజు ఎక్కువ డేటాని కోరుకునే వారికీ ఇది సరిగ్గా సరిపోతుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు ఎటువంటి పరిమితి లేకుండా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 84GB డేటాని అందిస్తుంది. అంతేకాదు, Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. 

ఇక అధిక లాభాలను అందించే మరొక జియో ప్లాన్ విషయానికి వస్తే, జియో యొక్క రూ.2599 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల వ్యాలిడిటీని కలిగివుంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీతో పాటుగా, అధనపు 10GB ఉచిత హై స్పీడ్ డేటాని అఫర్ చేస్తుంది.

అంటే, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 740 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo