Jio 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన 5G నెట్ వర్క్ లాంచ్.!

Jio 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన 5G నెట్ వర్క్ లాంచ్.!
HIGHLIGHTS

రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు తన 5G నెట్ వర్క్ ను విస్తరించింది

కొత్తగా మరో 9 ప్రాంతాలలో కూడా Jio 5G సేవలను ప్రారంభించింది

తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో తన 5G నెట్ వర్క్ ను చాలా వేగంగా విస్తరిస్తోంది

రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలకు తన 5G నెట్ వర్క్ ను విస్తరించింది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 34 సిటీలలో Jio True 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన జియో, కొత్తగా మరో 9 ప్రాంతాలలో కూడా Jio 5G సేవలను ప్రారంభించింది. వాస్తవానికి, తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియో తన 5G నెట్ వర్క్ ను చాలా వేగంగా విస్తరిస్తోంది. 

ఇక కొత్తగా 5G నెట్ వర్క్ అందుకున్న ప్రాంతాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి మరియు తాడేపల్లిగూడెం సిటీలలో జియో 5G సేవలు మొదలయ్యాయి. అంటే, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈ ప్రాంతాలలోని జియో కస్టమర్లు ఇప్పుడు వేగవంతమైన Jio 5G సర్వీస్ ను ఆనందించవచ్చు. 

ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. దీనికోసం My Jio App నుండి 5G ఎనేబుల్ కోసం అధ్యర్ధన నమోదు చెయ్యవలసి ఉంటుంది.      

మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo