BSNL యొక్క 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ విడుదల

HIGHLIGHTS

BSNL ఒక కొత్త అర్ధ సంవత్సర ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది.

BSNL యొక్క 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ విడుదల

ప్రస్తుతం, BSNL కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలను ప్రకటించడంలో ముందంజలో ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా, 3 కొత్త దీర్ఘకాళిక ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించిన ఈ ప్రభత్వరంగ సంస్థ ఇప్పుడు కొత్తగా మరొక దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL ఒక కొత్త అర్ధ సంవత్సర ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఆరునెలల ప్రీపెయిడ్ ప్లాన్ని రూ.899 ధరతో అందిస్తోంది. ఇది పూర్తి 180 రోజులకుగాను,  తక్కువ ధరతో విడుదల చేశారు. గత సంవత్సరం, BSNL తీసుకొచ్చినటువంటి వార్షిక ప్లాన్స్ రూ. 1699 మరియు రూ. 2099 ప్లాన్స్ వంటి మరొక రూ. 1,312  ప్రీపెయిడ్ వార్షిక ప్రణాళికలను కూడా ప్రారంభించింది.

రూ.899 ప్రణాళిక కింద, BSNL రోమింగుతో సహా అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ రోమింగ్ పరిస్థితుల్లో ఢిల్లీ మరియు ముంబై తప్ప మిగిలిన ఇతర అన్ని సర్కిళ్లలో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లానుతో, రోజువారి 1.5 GB డేటా వినియోగదారులకి లభిస్తుంది. అలాగే, ఈ పూర్తి వ్యాలిడిటీకి గాను అన్లిమిటెడ్ SMS (రోజుకు 50 మాత్రమే) వంటి ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది.

BSNL యొక్క ఈ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్, పూర్తిగా 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, 180 రోజుల పూర్తి చెల్లుబాటు కాలానికిగాను మొత్తంగా 270 GB ప్రయోజనాన్ని వినియోగదారులు అందుకుంటారు.                   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo