Pova 08 Pro: అల్ట్రా స్లీక్ డిజైన్ మరియు Sony కెమెరాతో రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది.!
టెక్నో పోవా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Pova 08 Pro రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది
Sony కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది
కేవలం 7.39 mm మందంతో స్లీక్ డిజైన్ లో బిగ్ 6500 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది
Pova 08 Pro: టెక్నో పోవా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్, Sony కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా టెక్నో రివీల్ చేసింది. ఈ ఫోన్ టీజర్స్ ద్వారా ఇది ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు క్లియర్ చేసింది.
SurveyPova 08 Pro: లాంచ్
పోవా 08 ప్రో స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.
Pova 08 Pro: ఫీచర్స్
టెక్నో పోవా 08 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం 7.39 mm మందంతో స్లీక్ డిజైన్ లో బిగ్ 6500 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సైబర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో మెరిసిపోతుంది. ఇందులో 6.78 ఇంచ్ హైపర్ లక్స్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, గొప్ప బ్రైట్నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అలాగే వెనుక 177 మినీ LED లతో రూపొందించిన లైవ్ డిస్ప్లే కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సెటప్ తో వస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultimate ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా పోవా P1 గ్రాఫిక్ చిప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన ఈ ఫీచర్స్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని టెక్నో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన AI అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో ఏఐ సమరీ, ఏఐ స్టూడియో మరియు మరిన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి.

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT 700C మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఇది స్లో మోషన్, మోషన్ ట్రైల్, ఏఐ స్టూడియో, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఏఐ ఆటో జూమ్ వంటి అనేక లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, 2 సంవత్సరాల OS అప్గ్రేడ్స్ మరియు 3 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వస్తుంది. ఇది గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ మరియు ఆర్క్ వైట్ మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: iQOO Z11 కీలక ఫీచర్స్ రివీల్ చేసిన ఐకూ .. జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!
అంచనా ప్రైస్
టెక్నో పోవా 08 ప్రో స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రూ. 27,999 నుంచి రూ. 31,999 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ ప్రైస్ రేపు మనకు అఫీషియల్ గా తెలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
