iQOO Z11 కీలక ఫీచర్స్ రివీల్ చేసిన ఐకూ .. జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

iQOO Z11 స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ ను ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఐకూ ఈరోజు రివీల్ చేసింది

ఈరోజు ఈ ఫోన్ కెమెరా, బ్యాటరీ మరియు ఇతర కీలక ఫీచర్లు కూడా బయటపెట్టింది

జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోందని కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్ వెల్లడిస్తున్నాయి

iQOO Z11 కీలక ఫీచర్స్ రివీల్ చేసిన ఐకూ .. జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.!

iQOO Z11 స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ ను ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఐకూ ఈరోజు రివీల్ చేసింది. ఇప్పటి వరకు ఈ డిజైన్ వివరాలు మాత్రమే వెల్లడించిన ఐకూ, ఈరోజు ఈ ఫోన్ కెమెరా, బ్యాటరీ మరియు ఇతర కీలక ఫీచర్లు కూడా బయటపెట్టింది. ఈ ఫోన్ అందమైన డిజైన్ తో పాటు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అవుతోందని కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్ వెల్లడిస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z11 : లాంచ్ డేట్

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 20వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంది.

iQOO Z11 : ఫీచర్స్

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ అందమైన మరియు చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనుక కర్వుడ్ డిజైన తో ఉంటుంది. ఇందులో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన బిగ్ 3D కర్వుడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 1.2 మిలియన్ కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7500 టర్బో చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది ప్రత్యేకమైన ఏఐ ప్రాసెసింగ్ యూనిట్ తో వస్తుంది.

iQOO Z11 launch and features

ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ అద్భుతమైన లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్, ప్రత్యేకమైన ఐకూ కెమెరా ఫీచర్స్ మరియు గొప్ప వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో గొప్ప బ్యాటరీ సెటప్ కూడా అందించింది. ఇందులో 7050 mAh బిగ్ బ్లూ వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఎక్కువ సమయం ఈ ఫోన్ కు బ్యాకప్ అందిస్తుందని ఐకూ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS తో వస్తుంది మరియు 3 OS అప్గ్రేడ్స్ అండ్ 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ లో ప్రత్యేకమైన ఆరిజిన్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.

Also Read: Sony Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ .. చవక ధరలో సౌండ్ బార్ అందుకోండి.!

ఇక ఈ ఫోన్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సెటప్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP68 అండ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile