LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు .. Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ పై ప్రభావం చూపే అవకాశం.!

HIGHLIGHTS

LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు చేసినట్లు కొత్త కధనాలు చెబుతున్నాయి

Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ పై ప్రభావం చూపే అవకాశం

ఈ న్యూస్ అన్ని సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా మారింది

LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు .. Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ పై ప్రభావం చూపే అవకాశం.!

LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు చేసినట్లు కొత్త కధనాలు చెబుతున్నాయి. ముందుగా ఈ డేట్ ఆగస్టు 16వ తేదీ గా ఉండగా, ఇప్పుడు ఈ డేట్ ను ఆగస్టు 23 వ తేదీ వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. అంతేకాదు, Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ అన్ని సోషల్ మీడియా మరియు న్యూస్ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వైరల్ న్యూస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు

తాజా నివేదికల ప్రకారం ఎల్.పి.జి e-KYC కోసం గతంలో పేర్కొన్న ఆగస్టు 16 గడువును ఆగస్టు 23, 2026 వరకు పొడిగించినట్టు సమాచారం. e-KYC పూర్తి చేయకపోతే అర్హత ఉన్న వినియోగదారులకు లభించే ల్.పి.జి `సబ్సిడీ లేదా సంబంధిత ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

LPG eKYC ఎందుకు అవసరం?

ఎల్.పి.జి e-KYC ద్వారా వినియోగదారుని గుర్తింపు, ఆధార్ వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఎల్.పి.జి ప్రయోజనాలు పొందుతున్న వారికి KYC పూర్తి చేయడం చాలా ముఖ్యం. అధికారిక PMUY పత్రాలలో కూడా ఆధార్ ఆధారిత authentication / e-KYC ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

ఎల్.పి.జి e-KYC ఎలా చేయాలి?

మీరు ఉపయోగించే ఎల్.పి.జి సిలిండర్ కంపెనీ యొక్క అధికారిక యాప్ ద్వారా లేదా గ్యాస్ ఆఫీస్ ను సందర్శించి కూడా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. మీరు మీరు ఉపయోగించే గ్యాస్ కంపెనీ ని బట్టి ఈ క్రింద సూచించిన యాప్స్ ద్వారా ఆన్లైన్ లో మీ ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.

  • Indane: IndianOil ONE యాప్
  • Bharat Gas: Hello BPCL యాప్
  • HP Gas: HP PAY యాప్

ఒకవేళ ఆన్‌ లైన్‌ లో ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కుదరకపోతే, మీ సమీపంలోని ఎల్.పి.జి డిస్ట్రిబ్యూటర్‌ ను సంప్రదించి కేవైసీ వివరాలను ధృవీకరించుకోవచ్చు.

LPG eKYC deadline

ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన వారు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీ ఈ-కేవైసీ స్థితిని అధికారిక ఎల్.పి.జి యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా చెక్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: Pova 08 Pro: అల్ట్రా స్లీక్ డిజైన్ మరియు Sony కెమెరాతో రేపు మార్కెట్లో లాంచ్ అవుతుంది.!

అప్డేట్ కోసం కంగారు పడకుండా స్థిమితంగా చేయండి. ఆలాగే మీ అప్డేట్ సమయంలో కొన్ని ముఖ్యమైన వివరాలు కూడా గుర్తుంచుకోండి. అదేమిటంటే, Aadhaar వివరాలు, OTP లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్‌ సైట్, WhatsApp లింకులు లేదా తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఈ-కేవైసీ కోసం ఎల్.పి.జి కంపెనీ అధికారిక యాప్ లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఉపయోగించండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile