GitHub Down: ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం.. డెవలపర్లకు తప్పని ఇక్కట్లు.!
సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ ప్లాట్ ఫామ్ గిట్ హబ్ కు సర్వీస్ కు ఈ రోజు భారీ అంతరాయం ఏర్పడింది
పుల్ రిక్వెస్ట్, Issues మరియు యాక్షన్స్ వంటి సేవలను ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు రిపోర్ట్
పలు సేవల్లో అధిక ఎర్రర్ రేట్ మరియు పెర్ఫార్మెన్స్ సమస్యలు చూసినట్లు గిట్ హబ్ స్వయంగా ధృవీకరించింది
GitHub Down: ప్రముఖ కోడ్ హోస్టింగ్, సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ ప్లాట్ ఫామ్ గిట్ హబ్ కు సర్వీస్ కు ఈ రోజు భారీ అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని డెవలపర్లు గిట్ హబ్ వెబ్ సైట్, రిపాజిటరీలు, పుల్ రిక్వెస్ట్, Issues మరియు యాక్షన్స్ వంటి సేవలను ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు. అంతేకాదు, పలు సేవల్లో అధిక ఎర్రర్ రేట్ మరియు పెర్ఫార్మెన్స్ సమస్యలు చూసినట్లు గిట్ హబ్ స్వయంగా ధృవీకరించింది.
SurveyGitHub Down: సమస్య ఏమిటి?
గిట్ హబ్ స్టేటస్ ప్రకారం, ఈ అంతరాయానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో, వెబ్ ఎక్స్ పీరియన్స్ , API ట్రాఫిక్ లో సుమారు 20 శాతం ఎర్రర్ రేట్ నమోదయింది. అలాగే ఆర్కైవ్ డౌన్ లోడ్స్ మరియు RAW రిపోజిటరీ కంటెంట్ డౌన్ లోడ్ లో దాదాపు 50 శాతం వరకు సమస్య కనిపించినట్లు గిట్ హబ్ తెలిపింది.
అంటే, కేవలం కేవలం గిట్ హబ్ వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడమే కాకుండా, కోడ్ డౌన్ లోడ్ చేయడం, రిపోజిటరీ కంటెంట్ యాక్సెస్ చేయడం, పుల్ రిక్వెస్ట్ లు నిర్వహించడం వంటి developer workflows కూడా ప్రభావితమయ్యాయి.

ఇదే విషయాన్ని ప్రముఖ సర్వీస్ డౌన్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector కూడా వెల్లడించింది. అంటే, ఈ సర్వీస్ ద్వారా డెవలపర్ మరియు యూజర్లు చేసిన రిపోర్ట్ ద్వారా ఈ డీటెయిల్స్ అందించింది.
Also Read: LPG eKYC డెడ్‌లైన్ పొడిగింపు .. Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ పై ప్రభావం చూపే అవకాశం.!
వేలాది మంది వినియోగదారులకు సమస్యలు
గిట్ హబ్ సమస్యలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వినియోగదారులను ప్రభావితం చేసినట్లు outage reports సూచిస్తున్నాయి. భారత్ సహా అమెరికా తదితర దేశాల్లో వినియోగదారులు వెబ్ సైట్ యాక్సెస్, రిపోజిటరీస్ మరియు ఇతర డెవలపర్ టూల్స్ లో సమస్యలు చూసినట్లు రిపోర్ట్ చేశారు.
గిట్ హబ్ పని చేయడం లేదని భారతీయ డెవలపర్ కమ్యూనిటీలో కూడా పలువురు వినియోగదారులు సోషల్ మీడియా మరియు Reddit వంటి ప్లాట్ ఫామ్ లలో పేర్కొన్నారు.
GitHub Down సమస్యలు ఎప్పటి వరకు సరి చేయబడతాయి?
ప్రస్తుతం పూర్తి స్థాయిలో సేవలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి అని ఖచ్చితమైన సమయాన్ని గిట్ హబ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సమస్యను పరిశీలిస్తూ mitigation చర్యలు చేపడుతున్నట్లు మాత్రం తెలిపింది. కాబట్టి డెవలపర్లు తమ గిట్ హబ్ వర్క్ ఫ్లోస్ ప్రభావితమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి అధికారిక గిట్ హబ్ స్టేటస్ పేజీని పరిశీలించడం మంచిది.
అయితే, ప్రస్తుతం ఈ సమస్య తీవ్రత తగ్గినట్లు డౌన్ డిటెక్టర్ లో రిపోర్ట్ కౌంట్ చెబుతోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
