BSNL జబర్దస్త్ ప్లాన్: రూ.500 రూపాయల లోపలే అన్లిమిటెడ్ సర్వీస్ అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

HIGHLIGHTS

BSNL బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL కస్టమర్లకు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్

డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను కూడా అఫర్ చేస్తాయి

BSNL జబర్దస్త్ ప్లాన్: రూ.500 రూపాయల లోపలే అన్లిమిటెడ్ సర్వీస్ అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

BSNL తన కస్టమర్లకు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను కూడా అఫర్ చేస్తాయి.అయితే, కేవలం రూ.500 లోపలే మీ బడ్జెట్ ఉంటే కొన్ని ప్లాన్స్ మాత్రమే అన్లిమిటెడ్ లాభాలను అందిస్తాయి.అందుకే, BSNL యొక్క ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.                       

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo