అతి తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందుకునే చాలా ప్రీపెయిడ్ ప్లాన్ లను బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు ఆఫర్ చేస్తోంది. అయితే, వీటిలో కూడా ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వుంది. ఆ BSNL Plan కేవలం నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా బెస్ట్ BSNL Plan?
బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2399 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ అన్ని ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 395 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ కోసం ఖర్చు చేసే అమౌంట్ ను 395 రోజులు, అంటే 13 నెలలకు విభజిస్తే నెలకు కేవలం రూ. 184 రూపాయలు మాత్రమే గా ఖర్చు అవుతుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ టోటల్ 395 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 395 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే 2GB స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చాలా కాలంగా వర్ధిల్లుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు నెలకు కేవలం రూ. 200 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో 13 నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు.