Realme P3x 5G: రియల్ మీ లేటెస్ట్ బడ్జెట్ IP69 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా చక ధరలో 6000mAh బిగ్ బ్యాటరీ, అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో రియల్ మీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ కంటే ముందే ఈ ఫోన్ స్పెక్స్, ప్రైస్ మరియు ఫీచర్స్ వంటి అన్ని అన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Realme P3x 5G: ప్రైస్
రియల్ మీ ఈ ఫోన్ బేసిక్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 13,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 14,999 ధరకే అందించింది. ఈ ఫోన్ పై ఆకట్టుకునే ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఈ ఆఫర్ తో ఈ రియల్ మీ కొత్త ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ realme.com మరియు Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ P3x స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ FHD స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను ప్రీమియం వేగాన్ లెథర్ తో రియల్ మీ అందించింది. ఈ కొత్త ఫోన్ IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ చాలా కెమెరా ఫిల్టర్స్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను రియల్ మీ అందించింది.