BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్: రోజుకి 1 రూపాయితో 365 రోజుల వ్యాలిడిటీ

HIGHLIGHTS

కేవలం ఒక్క రూపాయి చెల్లించి పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ

రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్

రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 SMS ‌లు

BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్: రోజుకి 1 రూపాయితో 365 రోజుల వ్యాలిడిటీ

చాలా తక్కువ ఖర్చుతో పూర్తి ఒక సంవత్సరం వ్యాలిడిటీ కోరుకునే BSNL కోసం ఇటీవల ఒక మంచి ప్లాన్ ప్రకటించింది.  ఈ ప్లానుతో రోజుకు కేవలం ఒక్క రూపాయి చెల్లించి పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని పొందవచ్చు. BSNL ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 365 రూపాయలతో ప్రకటించింది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు, దీనితో పాటుగా రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, పైన తెలిపిన వాయిస్ కాల్స్, డేటా మరియు SMS లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ, కస్టమర్లకు వ్యాలిడిటీ మాత్రం 365 రోజులు అంటే పూర్తిగా ఒక సంవత్సరం లభిస్తుంది. దీనితో పాటుగా, ఎక్కువ లాభాలనిచ్చే పోస్ట్ పైడ్ ప్లాన్స్ ని కూడా ఈ క్రింద చూడవచ్చు.   

BSNL బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ తో , బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు 300 నెట్ నిమిషాలు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్ .ఈ ప్లాన్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 25 జిబి వరకు డేటాను పొందుతారు.

రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ .ఇవి కాకుండా, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 50 జిబి డేటా మరియు 75 జిబి వరకు డేటాను పొందుతారు.

 రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్.ఇవి కాకుండా, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు 225 జిబి డేటా లభిస్తుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo