Install App Install App

BSNL బెస్ట్ ప్లాన్స్: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 21 Oct 2021
HIGHLIGHTS
  • ఎక్కువ లాభాలను అందించే BSNL అన్లిమిటెడ్ ప్రీపెయిడ్

  • అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా

  • బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL బెస్ట్ ప్లాన్స్: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్
BSNL బెస్ట్ ప్లాన్స్: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్

BSNL తన కస్టమర్ల కోసం చాలా బెస్ట్ ప్లాన్స్ అందించింది. అయితే, కస్టమర్లకు కేవలం రూ.500 లోపలే ఎక్కువ లాభాలను అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కొన్నే ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు డైలీ ఉచిత SMS వంటి సర్వీస్ లను అఫర్ చేస్తాయి.ఇది మాత్రమే కాదు, కేవలం రూ.500 కంటే తక్కువకే ఒక నెల వ్యాలిడిటీ మొదలుకొని పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్స్ ను కూడా BSNL అందించింది. మరి BSNL యొక్క ఆ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..!

BSNL రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.                       

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ పూర్తి 300 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL రూ.499 STV ప్లాన్

BSNL యొక్క రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: bsnl best plans with huge benefits
Tags:
BSNL BSNL best plans BSNL offers BSNL unlimited plans
DMCA.com Protection Status