BSNL బెస్ట్ ప్లాన్: అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్

BSNL బెస్ట్ ప్లాన్: అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్
HIGHLIGHTS

BSNL కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్

అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్

అనేక లాభాలను వినియోగదారులకు అందిస్తుంది

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL) తన కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. అయితే, సంవత్సరం మొత్తం అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. వీటిలో, రూ.1,999 రూపాయలతో వచ్చే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ అనేక లాభాలను వినియోగదారులకు అందిస్తుంది. ముందుగా దీన్ని కేవలం లిమిటెడ్ పిరియడ్ అఫర్ గా మాత్రమే అందించగా, తరువాత రెగ్యులర్ గా అఫర్ చేస్తోంది.  

Rs.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ : ప్రయోజనాలు

వాస్తవానికి, ఈ Rs.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా కాలంగా అందుబాటులో వుంది. ఈ ప్లాను ముందుగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, మీకు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 600 హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇక కాలింగ్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం మీకు లభిస్తుంది. వీటితో పాటుగా, డైలీ 100 SMS లను కూడా అఫర్ చేస్తోంది.

ఇక అధనపు ప్రయోజనాల విషయానికి వస్తే, పూర్తి సంవత్సరానికి, అంటే 365 రోజలు మీకు BSNL ట్యూన్స్ మరియు BSNL TV సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 అలాగే, కేవలం రూ.369 రూపాయలకే సంవత్సరం వ్యాలిడిటీ అందించే మరొక ప్లాన్ ని కూడా BSNL అందించింది.  BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo