రూ.397 రూపాయలకే 300 రోజుల వ్యాలిడిటీ: BSNL పటాకా అఫర్…!

రూ.397 రూపాయలకే 300 రోజుల వ్యాలిడిటీ: BSNL పటాకా అఫర్…!
HIGHLIGHTS

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బెస్ట్ ప్లాన్

ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా

అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ చేస్తుంది

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన కస్టమర్ల కోసం చాలా బెస్ట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. అయితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి ఖర్చుతోనే ఎక్కువ అలాభాలను అందించే బెస్ట్ ప్లాన్ మాత్రం ఒక్కటే వుంది.  అతితక్కువ ధరలో చాలా ఎక్కువ లాభాలను అఫర్ చేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.397 రూపాయల ప్లాన్.ఇది  ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ చేస్తుంది. ఈ రూ.397 రూపాయల ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్ ను బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల  వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 300 రోజులు లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo