BSNL గుడ్ న్యూస్: ఉచిత కాలింగ్ మరియు వ్యాలిడిటీ పొడిగింపు

HIGHLIGHTS

BSNL కస్టమర్లకు ఉచితంగా వ్యాలిడిటీ పొడిగింపు

100 నిముషాల ఉచిత కాలింగ్ కూడా ప్రకటన

BSNL కస్టమర్లు అందరికి కూడా వర్తింప చేసింది

BSNL గుడ్ న్యూస్: ఉచిత కాలింగ్ మరియు వ్యాలిడిటీ పొడిగింపు

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్ల కోసం ఉచిత కాలింగ్ మరియు ఉచిత వ్యాలిడిటీ పొడిగింపును ప్రకటించింది. కరోనా మహమ్మారి మరియు తౌక్తే తుఫాన్ కారణంగా రీఛార్జ్ చేసుకోలేని వారికీ 100 నిముషాల ఉచిత కాలింగ్ మరియు వ్యాలిడిటీ ని కూడా పొడిగించినట్లు వెల్లడించింది. ఈ ఉచిత వ్యాలిడిటీ పొడిగింపును ఏప్రిల్ 1, 2021 వరకూ వ్యాలిడిటీ ముగిసిన BSNL కస్టమర్లు అందరికి కూడా వర్తింప చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఉచిత వ్యాలిడిటీ పొడిగింపును మే 31 2021 వరకూ అందచేసినట్లు కూడా BSNL ప్రకటించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రీఛార్జ్ ఇబ్బందులను ఎదుర్కొనే పనిలేకుండా మే 31 వరకూ ఇన్ కమింగ్ సేవలను పొందవచ్చని కూడా BSNL తెలిపింది. అధనంగా, 100 నిముషాల ఉచిత టాక్ టైం కూడా ఇస్తామని కూడా కంపెనీ ప్రకటించింది.

అంటే,BSNL కస్టమర్లకు ఈ నెల చివరి వరకూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత వ్యాలిడిటీ తో ఇన్ కమింగ్ సేవలను పొందుతారు. దీని కోసం ఎటువంటి రీఛార్జ్ అవసరం కూడా ఉండదు. మహమ్మారి కారణంగా తన కస్టమర్లు ఇబ్బంది పడకుండా BSNL మంచి చర్యనే తీసుకుందని చెప్పవచ్చు.                         

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo