BSNL భారీ అఫర్: 365 రూపాయలకే 1 సంవత్సరం పూర్తి సర్వీస్
BSNL తన కస్టమర్లకు భారీ అఫర్ అందించింది
అతితక్కువ ధరలో పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ
ఈ ప్లాన్ కేవలం 365 రుపాయల ధరలో వస్తుంది
BSNL తన కస్టమర్లకు భారీ అఫర్ అందించింది. ఈ అఫర్ మీకు అతితక్కువ ధరలో పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కేవలం 365 రుపాయల ధరలో వస్తుంది. అంటే, కేవలం రోజుకు ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ అఫర్, ఇప్పటికే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది.
SurveyBSNL యొక్క ఈ 365 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
అయితే, ఇక్కడే ఒక మెళిక వుంది. అదేమిటంటే, ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
బిఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో , బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు 300 నెట్ నిమిషాలు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్ .ఈ ప్లాన్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 25 జిబి వరకు డేటాను పొందుతారు.
రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ .ఇవి కాకుండా, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 50 జిబి డేటా మరియు 75 జిబి వరకు డేటాను పొందుతారు.
రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
999 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్.ఇవి కాకుండా, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు 225 జిబి డేటా లభిస్తుంది.
మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile