BSNL 107 Plan validity reduced to 20 days
BSNL 107 Plan వ్యాలిడిటీ మరోసారి బిఎస్ఎన్ఎల్ తగ్గించింది. వాస్తవానికి, చాలా చవక ధరలో అనేక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీగా బిఎస్ఎన్ఎల్ కి మంచి పేరు ఉంది. అయితే, చవక ధరలో డేటా మరియు కాలింగ్ వంటి లాభాలు అందించే రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు కాలనీ తగ్గించడం అర్థం కాని విషయంగా మారింది. బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం అందిస్తున్న ప్రయోజనాలు మరియు వ్యాలిడిటీ కాలం వంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం పదండి.
బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ గతంలో 35 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండేది. అయితే, బిఎస్ఎన్ఎల్ అని వ్యాలిడిటీ ని తర్వాత కాలంలో 28 రోజులకు తగ్గించింది. అంతేకాదు, ఆ తర్వాత కూడా 28 రోజుల వ్యాలిడిటీ నుంచి గత సంవత్సరం 22 రోజుల వ్యాలిడిటీ కాలానికి కుదించింది. అయితే, ఇప్పుడు ఈ 22 రోజుల వ్యాలిడిటీ నుంచి 20 రోజులకు ఈ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ తగ్గించినట్లు అనౌన్స్ చేసింది.
ఇక బిఎస్ఎన్ఎల్ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ చూస్తే, ఈ ప్లాన్ 20 రోజలు చెల్లుబాటు అవుతుంది. ఈ 20 రోజులు చెల్లుబాటు కాలానికి గాను 200 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ మరియు 3GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ 3GB డేటా ముగిసిన తర్వాత కూడా 40 Kbps స్పీడ్ తో 20 రోజులు అన్లిమిటెడ్ ఉచిత డేటా కూడా అందిస్తుంది. కేవలం అతి చవక ధరలో సింపుల్ ప్లాన్ కోరుకునే వారికి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సరిపోతుంది.
అయితే, ఇంకొంచెం డబ్బులు పెట్టగలిగితే అన్లిమిటెడ్ లాభాలు ఎక్కువ రోజులు అందించే మరో బెస్ట్ రూ. 153 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సూపర్ బడ్జెట్ ప్లాన్ గా కొనియాడబడుతోంది.
Also Read: జెబ్రోనిక్స్ లేటెస్ట్ 3.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ బెస్ట్ డీల్స్ అందుకోండి.!
ఇది బిఎస్ఎన్ఎల్ అందించిన అతి చవక అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. బీఎస్ఎన్ఎల్ అందించిన రూ.153 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ యూజర్ కు మంచి ఎంపిక గా నిలుస్తోంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు మొత్తం 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 1GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ డైలీ 1 జీబీ డేటా పూర్తైన తర్వాత కూడా 40 Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
అదనంగా, అన్ని నెట్ వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ప్రతి రోజు 100 ఉచిత SMS లు కూడా ఈ ప్లాన్ తో అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలో డైలీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఉచిత SMS వంటి లాభాలు కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ డబ్బుకు తగిన విలువ అందించే మంచి ప్లాన్ అని చెప్పవచ్చు.