జియో, ఎయిర్టెల్ మరియు Vi నుండి అధిక డేటా అఫర్ చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

యూజర్లు డేటాని అధికంగా వినియోగిస్తున్నారు

ఎక్కువ డేటాని కలిగి వున్న ప్లాన్స్.

లాంగ్ వాలిడిటీని అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్

జియో, ఎయిర్టెల్ మరియు Vi నుండి అధిక డేటా అఫర్ చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

స్మార్ట్ ఫోన్ వచ్చిన నాటి నుండి యూజర్లు డేటాని అధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఎక్కువ డేటాని కలిగి వున్న ప్లాన్స్ ను ఎంచుకోవడానికే యూజర్లు మొగ్గు చూపుతున్నారు. వీటిలో కూడా ముఖ్యంగా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు ఎక్కువ డేటాని అందించే   ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అందుకే, ప్రధాన టెలీకం సంస్థలైనటువంటి Airtel , Jio మరియు Vi నుండి డైలీ 2GB హై స్పీడ్ డేటాతో పాటుగా ఎక్కువ వ్యాలిడిటీని అందించే బెస్ట్ ప్లాన్స్ ని గురించి చూద్దాం.

అంతేకాదు, మీరు ఎక్కువ డేటా తీసుకువచ్చే ఈ ప్లాన్లను 600 రూపాయల కంటే తక్కువ ధరలో ఎంచుకోవచ్చు. కాబట్టి, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు Vi (వోడాఫోన్ ఐడియా) యొక్క ప్రీపెయిడ్ ప్లాన్స్ లో, ప్రతిరోజూ 2 జిబి డేటాతో అపరిమిత కాలింగ్, SMS  సౌకర్యం మరియు లాంగ్ వాలిడిటీని  అందించే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి చూద్దాం.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్

మీరు రిలయన్స్ జియో వినియోగదారులు అయితే, మీకు జియో యొక్క గొప్ప ప్లాన్లు అందుబాటులో వున్నాయి. ఇది పైన పేర్కొన్న అన్ని సౌకర్యాలను మీకు అందిస్తుంది. ఈ ప్లాన్‌ను కంపెనీ 444 రూపాయల ధరతో అందిస్తోంది. ఇది కాకుండా, ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు 56 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ముఖ్యంగా, మీరు ప్రతిరోజూ 2GB డేటాతో పాటు 100 SMS ను కూడా పొందుతారు.

అలాగే, ఇటువంటి  మరో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ .599 ధరతో అందించింది. ఇది మీకు మునుపటి ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది.   

Vi (వోడాఫోన్ ఐడియా) ప్లాన్

Vi అంటే వోడాఫోన్ ఐడియా యొక్క ఈ ప్లాన్ రూ .595 ధరతో వస్తుంది మరియు ఈ ప్లాన్‌లో మీకు ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. ఇది కాకుండా, ఈ ప్లాన్‌ మీకు 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అలాగే, ఈ అపరిమిత ప్లాన్‌తో, మీరు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను అపరిమిత కాలింగ్‌  పొందుతారు. ఇది కాకుండా, మీరు ఒక సంవత్సరం ZEE5 ప్రీమియం యాక్సెస్‌ను కూడా అందుకోవచ్చు మరియు Vi మూవీస్ మరియు టీవీలకు కూడా యాక్సెస్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ కూడా ఇదే విధమైన ప్లాన్ కలిగి ఉంది, అయితే దాని ధర రూ .449. ఈ ప్లాన్ మీ కోసం గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ అవుతుంది. వాస్తవానికి, మీకు ఇందులో 56 రోజుల చెల్లుబాటు లభిస్తోంది. ఇది కాకుండా మీరు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌ను కూడా పొందుతారు, ప్రతిరోజూ 2GB డేటాతో పాటుగా మీకు ప్రతిరోజూ 100 SMS ను కూడా ఆ అందిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో, మీకు ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం కోసం ఉచిత యాక్సెస్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక నెల మొబైల్ ఎడిషన్ యాక్సెస్ ను కూడా అందుకుంటారు.

అయితే, ఇది కాకుండా, ఎయిర్టెల్ నుండి  రూ .558 రూపాయల మరొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఇది కూడా పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో వస్తుంది కానీ రోజుకు 3GB డేటాని అందిస్తుంది .

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా యొక్క ఉత్తమ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి Click Here పైన   నొక్కండి …! 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo