మెరుగైన 4G సేవలను అందించనున్న Airtel

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 01 Feb 2019
HIGHLIGHTS
  • ఇక 4G స్పీడ్ ఇళ్ళు ఆఫీసులలో కూడా తగ్గదని చెబుతున్న కంపెనీ.

మెరుగైన 4G సేవలను అందించనున్న Airtel
మెరుగైన 4G సేవలను అందించనున్న Airtel

ప్రస్తుతం టెలికం రంగంలో కొనసాగుతున్న పోటీకి అనుగుణంగా తన వినియోగదారులకి ఉన్నతమైన 4G అందించడం కోసం ఎయిర్టెల్ కొత్త సమీకరణలను చేస్తోంది. యూజర్లు, నెట్వర్క్ స్పీడుగా వుండే టెలికం పైపు మొగ్గుచూపడం వలన తన నెట్వర్కును వేగవంతంగా చేసేందుకు ఎయిర్టెల్ పూనుకుంది. ప్రస్తుతం, అందిస్తున్న నెట్వర్క్ కంటే అధికమైన నెట్వర్క్ స్పీడును అందించడం కోసం పనులను కూడా మొదలు పెట్టింది.

ఇదే కనుక జరిగితే, త్వరలోనే ఎయిర్టెల్ యొక్క 10 సర్కిళ్లలోని వినియోగదారులు ఉన్నతమైన 4G సర్వీసును అందుకోనున్నారు. ఎలాగంటే , 10 సర్కిళ్లలో ఎయిర్టెల్ ఒక ఉన్నతమైన 900 Mhz బ్యాండ్ 4G స్పెక్ట్రమ్ ను ఉపగిస్తుంది.ఇందులో, ఢిల్లీ, ముంబాయి వంటి సర్కిళ్ళతో పాటుగా తెలుగు రాష్ట్రాల సర్కిల్స్ కూడా ఉన్నాయి.    

 "ప్రధానంగా ఈ 900 LTE సాంకేతికతను ఇండోర్ నెట్వర్కు ను మెరుగు పరచడం కోసం తీసుకురానున్నాము మరియు దీని ద్వారా ఎటువంటి అంతరాయంలేని   4G  అందుబాటుని ఇవ్వనున్నామని", భారతి ఎయిర్టెల్ యొక్క CTO అయినటువంటి, రణదీప్ సెఖోన్ తెలిపారు.

ఈ టెలికం సంస్థ, ఈ సర్వీసును  ముంబాయి, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోల్ కతా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ , అస్సాం, రాజస్థాన్ వంటి సర్కిళ్లలో ఈ స్పెక్ట్రమ్ ని పూర్తిగా విస్తరించడం కోసం ఎరిక్సన్, హువావే, నోకియా మరియు ZTE తో కలసి పనిచేస్తోంది .  ఈ 900 Mhz స్పెక్ట్రమ్ కి విస్తరించబడిన తరువాత, ఎయిర్టెల్ యొక్క వినియోగదారులు ఆఫీసులు, ఇల్లు లేదా షాపింగ్ మాల్స్ వంటి ఇండోర్ పరిసరాలలో కూడా మంచి 4G కనెక్టవిటీని పొందుతారు.

 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status