ISRO PSLV-C60 SPADEX నింగికి ఎగసేది ఈరోజే: టైం మరియు లైవ్ ఎలా చూడాలో తెలుసుకోండి.!

HIGHLIGHTS

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది

PSLV-C60 ప్రయోగం పూర్తి స్థాయిలో సఫలం కావడంతో ఈ రాకెట్ సహాయంతో కొత్త ప్రయోగానికి శ్రీకారం

PSLV-C60 SPADEX రాకెట్ నింగికి ఎగరడానికి సిద్ధంగా వుంది

ISRO PSLV-C60 SPADEX నింగికి ఎగసేది ఈరోజే: టైం మరియు లైవ్ ఎలా చూడాలో తెలుసుకోండి.!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. PSLV-C60 ప్రయోగం పూర్తి స్థాయిలో సఫలం కావడంతో ఈ రాకెట్ సహాయంతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్ ని ప్రయోగించి అంతరిక్షంలో చారిత్రాత్మక ప్రయోగం చేయడానికి పూనుకుంది. ఈరోజు ఈ రాత్రి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ కూడా అయ్యింది. ఈ రోజు రాత్రి 10:00:15 గంటలకు PSLV-C60 SPADEX రాకెట్ లాంచ్ కోసం టైం సెట్ చేసింది మరియు ఈ రాకెట్ నింగికి ఎగరడానికి సిద్ధంగా వుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

PSLV-C60 SPADEX Launch

రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ లను అంతరిక్షంలోకి పంపించి వాటిని ఒకటిగా కలిపి ఒకటిగా చేయడమే ఈ కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో కొత్త పరికరాలు జత చేయడానికి మరియు పాత వాటిని విడదీయడానికి వీలుపడుతుంది. ఈ ప్రయోగం అంతరిక్షంలో భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS) నిర్మాణానికి, చంద్రమండలం పై చేరడానికి, చంద్రమండలం నుంచి శాంపిల్స్ ను చేరవేయడం వంటి చాలా ప్రయోగాలకు సహాయపడుతుంది, అని ఇస్రో చెబుతోంది.

ISRO PSLV-C60 SPADEX

ఈరోజు రాత్రి PSLV-C60 రాకెట్ ద్వారా 220 కేజీల బరువున్న రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ లను ఏక కాలంలో స్వతంత్రంగా ప్రయోగిస్తారు. ఈ ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ లు నింగికి ఏకకాలంలో విడివిడిగా చేరుకుంటాయి. అంతరిక్షంలో చేరిన తర్వాత ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ లలోని శాటిలైట్ లను ఒకదానికి మరొకటి జత చేస్తుంది (Docking). సక్సెస్ ఫుల్ గా జత చేసిన తర్వాత ఈ రెండిటి మధ్య ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్ ఫర్ ను డెమోన్స్ట్రేట్ చేసి మరలా తిరిగి విడదీస్తుంది (అన్ డాకింగ్).

Also Read: బ్రాండ్ న్యూ 50 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో 26 వేలకే అందుకోండి.!

PSLV-C60 SPADEX Launch : లైవ్ ఎలా చూడాలి?

ఈ శాటిలైట్ ప్రయోగం యొక్క లైవ్ కోసం ISRO అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసింది. యావత్ ప్రపంచం ఈ వేడుకకు సాక్షులుగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంది. ఈ లైవ్ కార్యక్రమం క్రింద డైరెక్ట్ గా చూడవచ్చు. ఈ లైవ్ కార్యక్రమం రాత్రి 9:30 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile