కరోనా ఉగ్రరూపం : 24×7 డాక్టర్ సహాయం అందించే Apps

కరోనా ఉగ్రరూపం : 24×7 డాక్టర్ సహాయం అందించే Apps
HIGHLIGHTS

బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ఇంటి నుండే చికిత్స పొందవచ్చు.

ఈ రోజు, ఆరోగ్య-సాంకేతిక యాప్స్ ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాయి. అంతేకాదు,  రోజులో ఏ సమయంలోనైనా డాక్టర్స్ నుండి వెంటనే సలహాను పొందడంలో సహాయపడతాయి. డాక్టర్ లక్షణాలను ట్రాక్ చేయవచ్చు మరియు వీడియో చాట్ ద్వారా అవసరమైన మందులను సూచించవచ్చు. ఈ కరోనా మహమ్మారి సమయంలో బయటకు వెళ్లే బదులు, ఇంటి నుండే  చికిత్స పొందవచ్చు. అలాగే, ఈ విషయం వేగవంతమైనది, సులభమైనది మరియు నమ్మదగినది.

ప్రాధమిక సంరక్షణ అందుబాటులో లేని మారుమూల ప్రదేశాలలో కూడా వీడియోల కాల్ తో సంప్రదించడం ద్వారా ఈ హెల్త్-టెక్ యాప్స్ ఆరోగ్య సంరక్షణకు అవకాశానాన్ని పెంచాయి. ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరైనా ఎప్పుడైనా వైద్యులను చేరుకోవచ్చు.

ఈ యాప్స్ ద్వారా డాక్టర్ సంప్రదించడం అనేది, రోగులను మరియు వైద్యులను కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా తీసుకువస్తాయి. వీడియో మరియు ఆడియో కనెక్టివిటీ వర్చువల్ మీటింగ్స్ తో ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా సరైన సమయంలో వైద్యం పొందవచ్చు. వైద్యం కోసం నగరానికి ప్రయాణించే బదులు, రోగులకు సులభంగా ఆన్‌లైన్‌లో అభిప్రాయాలను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే, ఈ విధంగా మీకు సహాయపడే నాలుగు ప్రధాన ఆరోగ్య సాంకేతిక యాప్స్ గురించి ఇక్కడ వివరిస్తున్నాను. వీటిద్వారా, మీరు వర్చువల్ గా  వైద్యులతో కనెక్ట్ కావచ్చు.

Navia Life Care:

ఇది డిజిటల్ హెల్త్ స్టార్టప్ మరియు ఇటీవలే తన వీడియో కన్సల్టింగ్ సదుపాయం, Navia  e-కౌన్సెలింగ్ ప్రారంభించింది. ఇది నవియా యొక్క స్మార్ట్ EMR ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించబడింది. ఇక్కడ వైద్యులు పేషేంట్ తో మాట్లాడి వారికీ కావాల్సిన అంధుల కోసం డిజిటల్ ప్రిస్క్రిప్షన్లను అందిస్తారు. ఇక్కడ రోగులు వారి ప్రిస్క్రిప్షన్లను వారి యాప్‌లో అలాగే వాట్సాప్‌లో అందుకుంటారు. డాక్టర్ చెప్పినట్లు మందులను ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ఉపయోగించి, పేషంట్స్ కావాల్సిన వైద్యులతో నియామకాలను బుక్ చేసుకోవచ్చు

Meddo:

రోగుల సంరక్షణ కోసం ఈ Meddo యాప్ ప్రధాన డాక్టర్స్ తో భాగస్వామ్యాన్ని చేసుకుంది. అన్ని ఆరోగ్య అవసరాలను ఒకే గూటికి చేర్చి అందిస్తుంది. వైద్యుల కౌన్సెలింగ్, పోషణ, జీవనశైలి, అత్యాధునిక ప్రయోగశాల పరీక్ష మరియు ఇతర ఆరోగ్య సేవలను అందిస్తుంది.

Prato :

ఇది వైద్యులు మరియు క్లినిక్స్ నెట్‌వర్క్స్ కు యాక్సెస్ అందించే యాప్.  దీనికి 120000 మందికి పైగా ధృవీకరించబడిన వైద్యులు ఉన్నారు. మీరు ఒక నిర్దిష్ట ప్రత్యేకతను లేదా వైద్యుడిని ఎన్నుకోవచ్చు మరియు మీ వ్యాధిని వివరించవచ్చు. అప్పుడు మీరు డాక్టర్‌ తో కాల్ లేదా చాట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా గూగుల్ మ్యాప్స్ ‌ను కూడా ఉపయోగించవచ్చు మరియు మీ సమీప వైద్యులకు ఇది మార్గం చూపిస్తుంది.

mFine:

ఇది AI తో 24×7 ఆన్‌లైన్ సంప్రదింపులను అందిస్తుంది మరియు 25 కి పైగా స్పెషలైజేషన్లను కలిగిఉంది. మీరు వివిధ ఆసుపత్రులు మరియు వైద్యులతో టై-అప్స్ ద్వారా వైద్యుడికి వీడియో లేదా ఆడియో కాల్స్ చేయవచ్చు. ప్రతి అపాయింట్‌మెంట్ కోసం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది కాని ఫాలో-అప్ కాదు కోసం మాత్రం కాదు. మీరు అప్లికేషన్ ద్వారా ప్రిస్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

ప్రపంచం కరోనావైరస్ వ్యాప్తితో బాధపడుతుండగా, ఈ లాక్డౌన్ సమయంలో మనకు ఇటువంటి వద్దకే అన్ని సేవలు వస్తున్నాయి. ఇందుకు, సాంకేతిక ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఆరోగ్య సేవలు కొనసాగుతున్నాయి , కానీ కరోనావైరస్ వ్యాధి అన్ని చోట్ల వ్యాపించి ఉంటే, అటువంటి సమయంలో మీ ఇంటి నుండి బయటికి వెళ్లడం ఎవరికీ సరైన పద్దతి కాదు.  ఈ సమయంలో మీకు ఆన్లైన్ ఆరోగ్య పరిస్కారం నిజంగా బాగా ఉపయోగపడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo