కొత్త Breathalyzer Test కేవలం 15 సెకన్ల లోపే కరోనావైరస్ సోకిందో లేదో నిర్ధారిస్తుంది

HIGHLIGHTS

కరోనావైరస్ నిర్ధారణ కోసం చేసే పరీక్షలలో సేకరించే నమూనాను విశ్లేషించడానికి ల్యాబ్ కి పంపించవలసి వుంటుంది.

కరోనావైరస్ నిర్ధారణ కోసం కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు కొన్ని రోజులు పడుతుంది.

ఈ కొత్త Breathalyzer ‌తో, ఎవరైనా కేవలం 15 సెకన్లలోనే కొరోనావైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకోవచ్చు.

కొత్త Breathalyzer Test కేవలం 15 సెకన్ల లోపే కరోనావైరస్ సోకిందో లేదో నిర్ధారిస్తుంది

నొవల్ కరోనావైరస్ ని అరికట్టే వ్యాక్సిన్ లేదా ఇతర మార్గాల అన్వేషణలో మొత్తం ప్రపంచం మునిగిపోయింది. ఇందులో భాగంగానే, Ohio State University పరిశోధకులు COVID-19 కు సంబంధించిన జీవక్రియలను కేవలం 15 సెకన్లలోనే గుర్తించగల Breathalyzer ‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి, కరోనావైరస్ నిర్ధారణ కోసం చేసే పరీక్షలలో నాసికా రంద్రం నుండి సేకరించే నమూనాను, తరువాత వాటిని విశ్లేషించడానికి ల్యాబ్ కి పంపించవలసి వుంటుంది. దీనికి కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు కొన్ని రోజులు పడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

కానీ, ఈ కొత్త Breathalyzer ‌తో, ఎవరైనా కేవలం 15 సెకన్లలోనే కొరోనావైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకోవచ్చు. దీని అర్థం ఏమిటంటే, విమానాశ్రయాలు, మాల్స్ మరియు వంటి బహిరంగ ప్రదేశాలలో మాస్ స్క్రీనింగ్‌లు మరియు పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. Medgadget నుండి మొదటిగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం, బ్రీత్‌లైజర్‌ను వైద్య రంగంలో విస్తృతంగా ఉపయోగించకపోవచ్చు, కాని త్వరలోనే అత్యధికమైన ప్రజాధారణ చూడవచ్చని  పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

what is Breathalyzer Test

ఒక ప్రకటనలో, లీడ్ డెవలపర్ Perena Gouma మాట్లాడుతూ, “ ప్రస్తుతానికి, శ్వాస విశ్లేషణ(Breath analysis) నిజంగా వైద్య రంగంలో ఇంకా విస్తృతంగా ఉపయోగించబడుతున్న సాంకేతికత కాదు, కాబట్టి ఇది ప్రారంభ దశ పనిగా పరిగణించబడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ మరియు VOC లను (volatile organic compounds) శ్వాసలో గుర్తించే సెన్సార్ పరికరం ఇది మరియు ఈ అంటు వ్యాధి ఉంటే దీని గురించి మీకు చెప్పడానికి ఉపయోగించవచ్చు ”. ఈ పరీక్ష చాలా సులభం మరియు చాలా చౌకగా ఉంటుంది. బ్రీత్‌లైజర్‌ను కలిగి ఉన్న ఎవరైనా తమపై తాము పరీక్ష కూడా చేయించుకోవచ్చు. ఈ బ్రీత్‌లైజర్, సంబంధిత వాయువులను సేకరించి కొలిచే కొత్త సూక్ష్మ పదార్ధాలను ఉపయోగిస్తుంది.

ఈ చేతితో పట్టుకొని సులభంగా వినియోగించే ఈ మానిటర్లను విస్తృతంగా పంపిణీ చేయడానికి కూడా ఈ సంస్థ కృషి చేస్తున్నట్లు చెబుతోంది మరియు ఇవి చాలా చవకైనవిగా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile